పండగ సీజన్ల లో చిన్న సినిమాలను రిలీజ్ చేయకపోవడానికి కారణం ఏంటంటే.?

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలా హవా ఎక్కువైపోయింది.ఇక ఎక్కడ చూసినా వాళ్ళ సినిమాలే వస్తున్నాయి.

ముఖ్యంగా పండుగ సీజన్ లను క్యాష్ చేసుకోవడానికి భారీ సినిమాలు రావడంతో చిన్న సినిమాలు పండుగ సీజన్లను మర్చిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

నిజానికి కొన్ని సినిమాలు కంటెంట్ బాగుంటే సంక్రాంతి కి రిలీజ్ చేస్తున్నప్పటికి ఆ సినిమాలు ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోవడంతో కొంతమంది ప్రొడ్యూసర్లు( Producers ) వాళ్ళ సినిమాలని పోస్ట్ పోన్ చేసుకుంటున్నారు.

ప్రతి చిన్న సినిమా పండుగ సీజన్ లో రిలీజ్ చేయలేకపోతున్నారు. """/" / తద్వారా పెద్ద హీరోల సినిమాలకు ఎక్కువ ఆదరణ దక్కుతుంది.

ఎందుకంటే పండగ పూట ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరు వాళ్ల సినిమాలను చూడడానికి వెళ్తారు.

కాబట్టి అక్కడ పెద్ద హీరోల సినిమాలు అయితేనే వాళ్ళు చూస్తూ ఎంజాయ్ చేస్తారు.

మిగతా చిన్న హీరోల సినిమాలను చూడడానికి పెద్దగా ఇంట్రెస్ట్ అయితే చూపించరు.ఇక దానికి తగ్గట్టుగానే చిన్న సినిమాలను బతికించాల్సిన అవసరం కూడా సినిమా ఇండస్ట్రీ పైన ఉంది.

ఇలా చేస్తేనే సినిమా ఇండస్ట్రీ సక్సెస్ ఫుల్ గా ముందుకు సాగుతుంది తప్ప లేకపోతే మాత్రం చాలా కష్టం అవుతుందనే చెప్పాలి.

ఇక ఇప్పుడు కూడా రాబోయే సంక్రాంతి సీజన్ కి చాలా పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.

ఇక ఈ దెబ్బతో చిన్న సినిమాలు వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. """/" / ఇక ఈ సంక్రాంతికి బాలయ్య బాబు( Balayya Babu ) బాకు మహారాజు గా, రామ్ చరణ్ గేమ్ చేంజర్, వెంకటేష్ సంక్రాంతికి వచ్చేస్తున్నాం లాంటి సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యాయి.

కాబట్టి ఈ సినిమా మధ్యలో చిన్న సినిమాలు రిలీజ్ చేసి ఎందుకు ఫెయిల్ చేసుకోవడం అనే ఉద్దేశ్యం తో కూడా చాలా మంది చిన్న ప్రొడ్యూసర్లు సంక్రాంతి బరిలో వాళ్ల సినిమాలను నిలపకుండా నార్మల్ రోజుల్లో వాళ్ల సినిమాలను రిలీజ్ చేస్తున్నారు.