నాగ శౌర్య వరుస ప్లాప్ లకి కారణం ఏంటి..? ఎందుకు ఆయనకు మాత్రమే ఇలా జరుగుతుంది…

తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు సక్సెస్ ల కోసం విపరీతంగా ఎదురుచూస్తున్నారు.

ఇక అలాంటి క్రమంలోనే యంగ్ హీరో అయిన నాగశౌర్య( Naga Shaurya ) కూడా ప్రస్తుతం ఒక భారీ సక్సెస్ ని అందుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు.

ఇక ఇప్పటివరకు బాగానే ఉంది.కానీ నాగశౌర్య విషయంలో మొదటి నుంచి కూడా ఒక తప్పైతే జరుగుతూ వస్తుందని చాలామంది సినీ విమర్శకులు అలాగే సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.

అదేంటి అంటే మొదట్లో ఆయన లవ్ స్టోరీలను చేసి మంచి విజయాలను అందుకున్నాడు.

"""/" / ఇక ఆ తర్వాత మాస్ సినిమాలు అంటూ మాస్ యాంగిల్ లోకి వెళ్లిపోవడం అనేది చాలామంది ప్రేక్షకులకు నచ్చడం లేదు.

మొత్తానికైతే ఆయన చేసే సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని నాగశౌర్య అనుకుంటున్నప్పటికీ అది మాత్రం కార్యరూపం దాల్చడం లేదు.

అందువల్లే ఆయనకు భారీ ఫ్లాప్ లు అయితే వస్తున్నాయి.ఇక ఇప్పుడు వరుసగా రెండు మూడు సినిమాలను కమిట్ అయిన నాగ శౌర్య ఈ సినిమాలతో కనుక మంచి సక్సెస్ ని అందుకోకపోతే మాత్రం ఆయన మార్కెట్ భారీగా డౌన్ అయిపోతుంది.

ఇక ఇప్పటికే ఆయన మార్కెట్ భారీగా పడిపోయింది.ఇకమీదట అదే సీన్ రిపీట్ అయ్యే అవకాశాలైతే ఉన్నాయి.

మరి మొత్తానికైతే ఈయన చేయబోయే సినిమాలతో ఎలాంటి సక్సెస్ ను సాధిస్తాడు అనేది కూడా తెలియాల్సిన అవసరమైతే ఉంది.

"""/" / ఇక నాగశౌర్య విషయంలో ఒక గాసిప్ అయితే సినిమా ఇండస్ట్రీలో బాగా వైరల్ అవుతుంది అది ఏంటి అంటే తన దగ్గరకు వచ్చిన దర్శకులు చెప్పే కథలో కొన్ని మార్పులు చేర్పులు చేస్తాడని తనకు నచ్చినట్టుగా మార్చమని దర్శకుడితో చెబుతాడని వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక దీనివల్ల కథల విషయంలో కూడా ఆయనకి చాలావరకు మైనస్ అవుతుంది.

ప్రభాస్ బాహుబలి2 రికార్డును ఏ సినిమా బ్రేక్ చేయలేదట.. ఏం జరిగిందంటే?