Kamal Haasan : కమల్ హాసన్ మార్కెట్ ఒక్కసారిగా భారీ గా డౌన్ అవ్వడానికి కారణం ఏంటంటే..?
TeluguStop.com
ఒకప్పుడు కమల్ హాసన్( Kamal Haasan ) వరుసగా మంచి సినిమాలను చేసుకుంటూ ఇండస్ట్రీలో తనకంటూ ఒక సపరేట్ ఇమేజ్ ను అయితే ఏర్పాటు చేసుకున్నాడు.
ముఖ్యంగా ఈయన ఆర్ట్ సినిమాలను ఎక్కువగా చేస్తూ ప్రతి ప్రేక్షకుడిని కట్టిపడేసేలా తన పర్ఫామెన్స్ తో మెప్పించేవాడు.
సాగర సంగమం, శుభసంకల్పం, స్వాతిముత్యం, భామని సత్యభామని, నాయకుడు, దశావతారం లాంటి సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అయితే సంపాదించుకున్నాడు.
ఇక ఇదిలా ఉంటే ఆయన చేసిన ప్రతి సినిమాలో వైవిధ్యమైన కథాంశం అయితే ఉంటుంది.
ఇక ఇది ఇలా ఉంటే చాలా సంవత్సరాల నుంచి ఆయన మార్కెట్( Kamal Haasan Market ) అనేది భారీగా డౌన్ అవుతూ వస్తుంది.
రజినీకాంత్, చిరంజీవి, మమ్ముట్టి వాళ్లతో పోల్చుకుంటే కమల్ హాసన్ మార్కెట్ అనేది భారీ గా తగ్గింది.
ఇక విక్రమ్ సినిమా( Vikram Movie ) వచ్చి ఒకసారిగా ఆయన మార్కెట్ ను భారీగా పెంచినప్పటికీ """/" /
ఆయన మార్కెట్ అయితే కన్సిస్టెంట్ గా పెరగడం లేదనే చెప్పాలి.
దానికి కారణం ఏంటి అంటే ఆయన మాస్ హీరోగా నిలబడలేకపోవడమే ముఖ్య కారణం అంటూ పలువురు సినీ మేధావులు సైతం వాళ్లభిప్రాయాలను తెలియజేస్తున్నారు.
ఒక మాస్ హీరో గా ఇండస్ట్రీలో ఎదిగితే ఆయనకి ఎన్ని ఫ్లాపులు వచ్చినా కూడా ఒక్క హిట్ వచ్చిందంటే మళ్లీ మాస్ లో ఆయనకి మంచి ఆదరణ ఉంటుంది.
"""/" /
కాబట్టి ఒక్క సినిమాతో సక్సెస్ కొడితే మార్కెట్ అనేది భారీగా పెరుగుతుంది.
కానీ క్లాస్ సినిమాలు ఆర్ట్ కు సంబంధించిన సినిమాలు చేసుకుంటూ వెళ్లే వారికి క్లాస్ ఇమేజ్ మాత్రమే వస్తుంది.
దాని ద్వారా ఒకసారి మార్కెట్ భారీగా డౌన్ అయింది అంటే మళ్ళీ పూర్వ వైభవాన్ని తెచ్చుకోవాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని అనే చెప్పాలి.
ప్రస్తుతం కమల్ హాసన్ విషయంలో అదే జరుగుతుంది.
కెనడాలో పంజాబీ గ్యాంగ్‌స్టర్‌కు బిగుస్తోన్న ఉచ్చు .. భారత్‌కు రప్పించాలని కేంద్రం పావులు