చెన్నై టీమ్ వరుస ఫెయిల్యూర్ కి కారణం ఏంటంటే..?

  చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ లక్నో సూపర్ జాయింట్స్ టీమ్ లా మధ్య జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ భారీ ఓటమిని చవి చూడాల్సి వచ్చింది.

ఇక ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ అద్భుతమైన బ్యాటింగ్ చేసి 210 పరుగులు సాధించింది.

ఇక టీమ్ లో గైక్వాడ్( Ruturaj Gaikwad ) అద్భుతమైన సెంచరీ(108) చేసి బ్యాటింగ్ భారం మొత్తాన్ని తన భుజాలపై మోసాడనే చెప్పాలి.

ఇక శివం దూబే అయితే చివరిలో హిట్టింగ్ పెర్ఫా మెన్స్ ఇస్తూ 66 పరుగులు చేసి టీం భారీ స్కోర్ చేయడంలో ఉంచాలని చెప్పాలి.

"""/" / ఇక ఇంత భారీ స్కోర్ చేసినప్పటికీ లక్నో సూపర్ జాయింట్స్( Lucknow Super Giants ) మాత్రం ఎక్కడ పట్టు వదలకుండా అద్భుతమైన పర్ఫామెన్స్ ని ఇచ్చింది.

ఇక ముఖ్యంగా స్టోయినిస్( Marcus Stoinis ) ఐపీఎల్ లో తన మొదటి సెంచరీని నమోదు చేసుకున్నాడు.

ఇక తను నాటౌట్ గా మిగిలి టీమ్ ను విజయ తీరాలకు చేర్చడంలో చాలావరకు సక్సెస్ అయ్యాడు.

ఇంకో మూడు బాల్స్ మిగులి ఉండగానే వాళ్ళు నిర్దేశించిన టార్గెట్ ను రిచ్ అవ్వడం అనేది ఒక మంచి విషయమనే చెప్పాలి.

ఇక లక్నో సూపర్ జయింట్స్ టీమ్ వరుసగా రెండు సార్లు చెన్నై సూపర్ కింగ్స్ టీం ను ఓడించి తమ సత్తా ఏంటో చూపించుకుంది.

ఇక చెన్నై మాత్రం వరుసగా రెండుసార్లు వాళ్ళ చేతిలో మూట గట్టుకోవాల్సి వచ్చింది.

చెన్నై అసలు ఇలా ఎందుకు ఆడుతుంది అనేది కూడా ఒక సందేహంగా మారింది.

ఒక మ్యాచ్ గెలిస్తే రెండు మ్యాచ్ ల్లో ఓడిపోతున్నారు. """/" / దీనికి గల ముఖ్య కారణం ఏంటి అంటే చెన్నై బౌలింగ్ అంత పటిష్టంగా కనిపించడం లేదు.

మొన్నటి వరకు బౌలింగ్ లో చాలా అద్భుతమైన ప్రదర్శనలు అందించినప్పటికీ మతిషా పతిరానా, ముస్తిఫిజర్ రెహమాన్ గాని డెత్ ఓవర్లలో దారుణమైన పరుగులను ఇస్తున్నారు.

దానివల్లే టీమ్ ఓడిపోతూ వస్తుంది.మరి దీనికి గల కారణాలు ఏంటి అనేది తెలుసుకొని దాన్ని అధిగమిస్తే టీం మళ్లీ స్ట్రాంగ్ అవుతుంది.