నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసిన తర్వాత కచ్చితంగా కాళ్లు కడుక్కోవాల్సిందేనా!

మన హిందూ సంప్రదాయాల ప్రకారం నవ గ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేసినా లేదా పూజ చేసినా.

నవ గ్రహాలను తాకినా కాళ్లు, చేతులు, మొహం కడుక్కోవాలని చెబుతుంటారు మన పెద్దలు.

అయితే ఆలయానికి వెళ్లి వచ్చేటప్పుడు కాళ్లు కడుక్కోని మనం.నవ గ్రహాల చుట్టూ తిరిగిన తర్వాత మాత్రం ఎందుకు కడుక్కోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

దేవాలయంలో ఉన్న నవ గ్రహాలకు ప్రదక్షిణలు చేసిన తర్వాత కాళ్లు కుడుక్కోకపోతే ఏదో పీడ కల్గుతుందనే చాలా మంది చెబుతుంటారు.

అయితే మనకున్న పీడను వదిలించుకునేందుకు మనం నవ గ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంటాం.

నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేయడం లేదా పూజ చేయడం వల్ల మనకు పట్టిన పీడ పోతుందని పురాణాలు చెబుతున్నాయి.

అయితే అలా పూజలు, ప్రదక్షిణలు చేసిన తర్వాత మాత్రం కాళ్లు కడుక్కోవాలని ఎక్కడా లేదు.

నవ గ్రహాల ఆలయమైనా లేదా మరో దేవాలయం అయినా అన్నీ పవిత్రమైనవే.అలా పవిత్ర ప్రదేశంలో చేసిన సత్కర్మ వ్యక్తిని పవిత్రుడిని చేస్తుంది.

కానీ అపవిత్రత అంటదు.పవిత్ర ప్రదేశంలో పవిత్ర కర్మను ఆచరించి అపవిత్రతను భావించడమే పెద్ద దోషం.

అందుకే కాళ్లు కడుక్కోకపోయినా పర్లేదు.ఒక వేళ మీ ఆచార సంప్రదాయాలను బట్టి చేయాల్సి ఉంటే చేసినా పెద్ద తప్పేం లేదు.

మీరు ఏం చేసినా.అపవిత్రంగా ఆలోచించకుండా ఉంటే సరిపోతుంది.

అంతే కానీ కాళ్లు కడుక్కుంటే శని మన వెంటే వస్తుందా అని ఆలోచిస్తూ.

ప్రదక్షిణలు చేస్తే మాత్రం ప్రతిఫలం ఉండదు.

బీసీలను అణగదొక్కే పార్టీ బీజేపీ..: వీహెచ్