ఎంగిలి పూల బతుకమ్మ అని ఎందుకు పిలుస్తారో తెలుసా?

తొమ్మిది రోజుల పాటు తెలంగాణ వాసులు ఘనంగా జరుపుకునే బతుకమ్మ పండుగ గురించి ప్రతీ ఒక్కరికీ తెలిసిందే.

అయితే తొమ్మిది రోజుల పాటు నిర్వహించే ఈ బతుకమ్మలను ఒక్కో రోజు ఒక్కో విధంగా పిలుస్తుంటారు.

అయితే మొదటి రోజు బతుకమ్మను ఎంగిలి పూల బతుకమ్మ అని పిలుస్తారని మన అందరికే తెలిసిందే.

కానీ అలా ఎందుకు పిలుస్తారనే విషయం మాత్రం చాలా మందికి తెలియదు.అయితే అసలు మొదటి రోజు బతుకమ్మను ఎంగిలిపూల బతుకమ్మ అని ఎందుకు పిలుస్తారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

మహాలయ అమావాస్య రోజున అంటే.భాద్రపదం చివరి రోజు లేదా ఆశ్వయుజ మాసం ముందురోజు మొదలవుతుంది.

బతుకమ్మను పేర్చేటప్పుడు ఆ పూల కాడలను చేతులతో తుంచి పెడతారు.కొందరు కత్తితో, కత్తెరతో కట్ చేసి, మరికొందరు నోటితో కొరికి పెడుతుంటారు.

అయితే అలా చేస్తే ఆ పూలు ఎంగిలి అయినట్లుగా భావిస్తారు.అప్పటి నుంచి మొదటి రోజు చేసే బతుకమ్మను ఎంగిలి పూల బతుకమ్మ అని పిలుస్తున్నారు.

మరికొన్ని చోట్ల మొదటి రోజు బతుకమ్మ కోసం ముందు రోజే పూలు తీసుకొచ్చే వాళ్లట.

ముందురోజు తీసుకొచ్చిన పూలు కాబట్టి ఎంగిలి పూల బతుకమ్మ అయిందని చెబుతుంటారు.తెలంగాణలోని పెత్తరమాసకు చాలా ప్రాధాన్యత ఇస్తారు.

ఆరోజు చాలా ప్రాంతాల్లో మాంసాహారం, పిండి వంటలు వండుకొని పెద్దల ఆత్మకు శాంతి కల్గాలని పెట్టుకుంటారు.

అయితే నీచు తిని బతుకమ్మ చేయడం వల్ల ఆ బతుకమ్మ ఎంగిలి పూల బతుకమ్మగా మారిందని మరికొందు చెబుతారు.

అంతే కాదండోయ్ తిన్న తర్వాత బతుకమ్మ పేరుస్తారని.అందుకే ఆ బతుకమ్మకు ఆ పేరు వచ్చిందని కూడా ప్రతీతి.