ఉరుములు వస్తుంటే అర్జన, ఫల్గున అని ఎందుకంటారో తెలుసా?

భారీ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం వస్తుంటే చాలా మంది భయంతో వణికి పోతుంటారు.

ఇళ్లలోనే ఉన్నప్పటికీ.ఉరుముల శబ్దాన్ని తట్టుకోలేకపోతుంటారు.

అప్పుడు ధైర్యం కోసం అర్జున, ఫల్ణున అనడం మనందరికీ తెలిసిన విషయమే.కానీ మనకు ఎన్నో దేవుళ్లు ఉండగా.

ఉరుములు వచ్చినప్పుడు అర్జున, ఫల్గున అని మాత్రమే ఎందుకు అంటాం? అలా అంటే నిజంగానే మనకు భయం పోయి ధైర్యం వస్తుందా అనే అనుమానాలు చాలా సార్లే వస్తుంటాయి.

అయితే నిజంగానే అర్జున, ఫల్గున అంటే ధైర్య వస్తుందా అలా ఎందుకు అంటామో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ఉరుములు, మెరుపులు, పిడుగులతో వర్షం కురుస్తున్నప్పుడు వాతావరణం అంతా భయానకంగా ఉంటుంది.అప్పుడు అంత కంటే భయానకంగా యుద్ధం చేసి శుత్రువులకు ధడ పుట్టించే అర్జునుడి పది పేర్లను తలుచు కుంటే.

మనకు భయం పోయి ధైర్యం వస్తుందని పాత కాలంలోని పెద్దలు చెప్పేవారు.అర్జునుడి పది పేర్లు అయిన అర్జునుడు, ఫల్గునుడు, పార్థుడు, కిరీటి, శ్వేత వాహనుడు,బీభత్సుడు, విజయుడు, సవ్యసాచి, ధనుంజయ.

అంటూ పది పేర్లు స్మరించాలని వివరించారు అలా పఠిస్తే.పిడుగుల భయం తొలగి, ప్రశాంత వాతావరణం ఏర్పడుతుందని అనే వారు.

అప్పట్లో చాలా మందికి ఆఈ పేర్లను తలుచుకొని తమ భయాన్ని పోగొట్టుకున్నారు కూడా.

అందుకే ఇప్పటికీ అదే మనం కూడా ఫాలో అవతూ వస్తున్నాం.ఉరుములు, మెరుపులతో వాతావరణం భయానకంగా మారితే.

అర్జునుడు పది పేర్లు కాకపోయినా అర్జున, ఫల్గున అనే రెండు పేర్లు తలుచుకొని ధైర్యం తెచ్చుకుంటుంటాం.

లేడీస్ కోచ్‌లో ప్రయాణిస్తున్న మగవారి చెంపలు పగలగొట్టిన ఆడపోలీసులు.. వీడియో వైరల్..