ఆగిపోయిన అపరిచితుడు బాలీవుడ్ రీమేక్ కారణం ఏంటంటే..?
TeluguStop.com
శంకర్ డైరెక్షన్ లో బాలీవుడ్ స్టార్ హీరో అయిన రణవీర్ సింగ్( Ranveer Singh ) హీరోగా అపరిచితుడు సినిమాని రీమేక్ చేయాలని చూశారు.
కానీ ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఆ సినిమాని ఆపేసినట్టుగా సమాచారం అయితే వస్తుంది.
ఇంకా ఇప్పటికే శంకర్( S.Shankar ) భారతీయుడు 2 గేమ్ చేంజర్ లాంటి సినిమాలను చేస్తున్నాడు.
ఇక ఈ సినిమాల వల్ల అపరిచితుడు సినిమాను పక్కన పెట్టాడు.గత కొన్ని రోజుల నుంచి ఈ సినిమా తొందర్లో స్టార్ట్ అవుతుంది అనే వార్తలు వచ్చినప్పటికీ ఇప్పుడు మాత్రం శంకర్ అఫీషియల్ గా ఈ సబ్జెక్ట్ నుంచి తను తప్పకున్నట్టుగా చెప్పి ఈ సినిమా ఆగిపోయినట్టుగా కూడా సమాచారమైతే అందుతుంది.
"""/" /
ఇక ప్రస్తుతం భారతీయుడు 2, గేమ్ చేంజర్ సినిమాలను రిలీజ్ చేసిన తర్వాత మరొక తెలుగు స్టార్ హీరో తోనే తను ఒక సినిమా చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది.
అందుకోసమే బాలీవుడ్ హీరోని పక్కన పెడుతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి.మరి ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం శంకర్ ఈ సినిమాను పక్కన పెట్టడం వల్ల రన్వీర్ సింగ్ ఈ సినిమా కోసం ఇప్పటివరకు చేసిన కసరత్తులు కూడా వృధా అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ కొంతమంది వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.
"""/" /
ఇక మరి కొంతమంది మాత్రం అపరిచితుడు లాంటి ఒక క్లాసికల్ మూవీని మళ్లీ రీమేక్ చేసి దాన్ని చెడగొట్టే ప్రయత్నం మానుకున్నందుకు సంతోషపడుతున్న అంటూ సోషల్ మీడియాలో చాలామంది వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు.
ఇక మొత్తానికైతే ఒక భారీ ప్రాజెక్టుకి తెరపడిందనే చెప్పాలి.ఇక ఇప్పటికే రన్వీర్ సింగ్ ఈ ప్రాజెక్టు వల్ల కొన్ని సినిమాలు వదులుకున్నాడు.
మరి ఇప్పుడు మళ్ళీ వాటిని చేసే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది.చూడాలి మరి శంకర్ తన నెక్స్ట్ సినిమాను ఏ హీరోతో చేస్తాడు అనేది.
ఐకాన్ స్టార్ బన్నీకి 2025 సంవత్సరం కలిసొస్తోందా.. ఆ విధంగా సక్సెస్ అవుతున్నారుగా!