శ్రీశైలంలో పాతాళ గంగలోని నీరు పచ్చగా ఎందుకుంటుంది?

శ్రీశైలంలోని పాతాళ గంగలో నీరు ఎప్పుడు చూసినా పచ్చగా కనిపిస్తుంది.ఇది చాసిన ప్రతీ సారి ఎందకిలా పచ్చగా ఉంది అనే అనుమానం కలుగుతుంటుంది.

అంతేకాదు కింద నాచు పట్టడం వల్లే మనకలా కనిపిస్తుందేమో అని కూడా అనుకుంటాం.

కానీ నిజానికి అది కారణం కాదు.దీనికి ఇంకో కారణం ఉంది.

అదేంటో మీరూ చూసేయండి.చంద్ర గుప్త మాహారాజు అనేక సంవత్సరాలు యుద్ధం చేసి, విజయాలతో రాజ్యం చేరతాడు.

అంతఃపురంలోని స్త్రీలతో ఉన్న అందాల రాశిని తన కూతురని తెలియక ఆశిస్తాడు.ఆపై తెలిసినా తనతో పడక పంచుకోమంటూ నానా ఇబ్బందులు పెడతాడు.

కన్నబిడ్డని కూడా చూడకుండా చరచబోతాడు.అది తట్టుకోలేని చంద్రావతి ఇంటి నుంచి పారిపోతుంది.

అలా వెళ్తూ వెళ్తూ చంద్రావతి శ్రీశైలం అరణ్యాలకి వచ్చి చేరుతుంది.ఎక్కడికెళ్లాలో ఏం చేయాలో పాలుపోక.

పరమేశ్వరుడిని అనుగ్రహించమని తపస్సు చేస్తుంది.అక్కడికి కూడా చంద్ర గుప్తుడు వచ్చి చంద్రావతిని చెపపట్టబోతాడు.

"""/" / తన భక్తురాలిని తండ్రే చరచబోతున్నాడనే విషయం తెలిసుకొని తీవ్ర ఆగ్రహానికి లోనవుతాడు.

కామంతో కనులు మూసుకుపోయిన నీవు పచ్చల బండవై పాతాళ గంగలో పడి ఉండమని శపిస్తాడు ఆపై వేడుకోగా.

శ్రీ మహా విష్ణువు కలియుగంలో అవతరిస్తాడు.ఆ అవతార పురుషుడు స్నానంకై పాతాళ గంగలో దిగిన నాడు, స్నానం ఆచరించిన నాడు నీకు శాప విమోచనం కలుగుతుందని మహేశ్వరుడు సెలవిస్తాడు.

అందుకే శ్రీ శైలంలోని పాతాళ గంగలో నీరు ఎప్పుడూ పచ్చగా ఉంటుంది.

చైనా పరువు గంగపాలు.. ఈ వీడియో చూస్తే డ్రాగన్ కంట్రీపై అభిప్రాయం మారిపోతుంది!