శుభలేఖలకు పసుపు, కుంకుమలు ఎందుకు రాస్తారు?
TeluguStop.com
హిందూ సంప్రదాయాల ప్రకారం పెళ్లి క్రతువుకు చాలా ప్రాముఖ్యత ఉంది.పెళ్లి చూపుల్లో అమ్మాయిని చూసి ఇష్టపడ్డప్పటి నుంచి పెళ్లి పూర్తయి అమ్మాయిని అత్తారింటికి పంపే వరకు ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తుంటారు.
అందులో భాగంగానే పెళ్లికి వచ్చి నూతన వధూవరులను ఆశీర్వదించమంటూ బంధువులకు, స్నేహితులకు, తెలిసిన వాళ్లకు ఇచ్చేందుకు పెళ్లి పత్రికలు పంచుతుంటారు.
అయితే ముందుగా వాటిని అచ్చు వేయించాక వాటిని ఇంటికి తీసుకొస్తారు.పత్రికలన్నింటికి పసుపు, కుంకుమలు పెట్టి ముందు దేవుడి ముందు పెడ్తారు.
ఆ తర్వాతే అందరికీ పంచుతుంటారు.అయితే ఆల్రెడీ అచ్చు వేయించిన పత్రికలకు పసుపు, కుంకుమలు ఎందుకు పెడ్తారనే అనుమానం చాలా మందికే వచ్చి ఉంటుంది.
అయితే అసలు పెళ్లి పత్రికలకు నాలుగు మూలలా పసుపు, కుంకుమలు ఎందుకు పెట్టాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
శ్రీ మహా లక్ష్మికి ఆమె అక్క అయిన జ్యేష్ఠా దేవికి ఎవరు ఎక్కడెక్కడ ఉండాలనే విషయంపై చర్చ జరుగుతుందని.
ఈ క్రమంలోనే లక్ష్మీదేవి వెళ్లి సముద్రంలో దాక్కుటుంది.అయితే లక్ష్మీ దేవిని బయటకు రమ్మని జ్యేష్ఠాదేవి కోరుతుంది.
అలా బయటకు వచ్చిన లక్ష్మీ దేవి తాను ఏ ఏ ప్రదేశాల్లో ఉండగలదో చెబుతుంది.
వాటిలో పసుపు, కుంకుమలు ఒకటి.అందుకే వివాహ శుభలేఖలకు పసుపు రాసి లక్ష్మీ దేవికి ఆహ్వానం పలుకుతుంటారు.
ఇలా లక్ష్మీకి ఆహ్వానం పలకటం వల్ల ఆమె సదా వీరిపై తన కృప చూపగలది పురాణాలు చెబుతున్నాయి.
అందుకే మన పెద్దలు వివాహ పత్రికలకు పసుపు, కుంకుమలు రాస్తుంటారు.
పెళ్లి చేసుకుని వార్తల్లో నిలిచిన బిగ్ బాస్8 సోనియా ఆకుల.. కంగ్రాట్స్ అంటూ!