3 నెలల్లో సినిమా తీసే పూరి జగన్నాథ్ ఇప్పుడు లేట్ చేయడానికి కారణం ఏంటి..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన పూరి జగన్నాథ్ ఒకప్పుడు మూడు నెలలకు ఒక సినిమా చేసేవాడు.

వీలైనంత తొందరగా సినిమాలను తీసి రిలీజ్ చేయడంలో ఆయనను మించిన దర్శకులు మరెవరు లేరు అనేంతలా గుర్తింపును సంపాదించుకున్నాడు.

మరి అలాంటి పూరీ జగన్నాథ్( Puri Jagannadh ) ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్( Double ISmart ) సినిమా కోసం చాలా రోజులపాటు సమయాన్ని ఎందుకు తీసుకుంటున్నాడు అనే వార్తలైతే వినిపిస్తున్నాయి.

"""/" / నిజానికి పూరి జగన్నాథ్ చాలా తొందరగా సినిమాను చేసిన సమయంలోనే భారీ సక్సెస్ లను అందుకున్నాడు.

ఎప్పుడైతే సినిమాలను లేట్ చేస్తున్నాడో అప్పటినుంచే ఆయన చాలావరకు వెనకబడిపోతున్నట్టుగా తెలుస్తుంది.నిజానికి పూరి జగన్నాథ్ కి ఒక సినిమా మీద ఎక్కువ రోజులు కష్టపడడం ఇష్టం ఉండదు.

మరి అలాంటప్పుడు చాలా తొందరగా సినిమాను తీయవచ్చు కదా అంటే ఇప్పుడు వస్తున్న సిచువేషన్స్ ను బట్టి ఆయన ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది.

"""/" / లైగర్ సినిమా టీమ్ లో కరోనా రావడం వల్ల చాలా రోజులపాటు సినిమా షూటింగ్ లేక ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది.

ఇక ఇప్పుడు చేస్తున్న డబుల్ ఇస్మార్ట్ ( Double ISmart )సినిమా కోసం ఆయనే కావాలనే కొంచెం ఎక్కువ టైం తీసుకుంటున్నట్టుగా కూడా తెలుస్తుంది.

ఎలాగైనా ఈ సినిమాతో సక్సెస్ కొట్టాలని ఆయన చూస్తున్నాడు.మరి ఆయన అనుకున్నట్టుగా ఈ సినిమాతో భారీ సక్సెస్ దక్కుతుందా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.

ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాతో కనక సూపర్ అందుకుంటే పూరి జగన్నాథ్ మరోసారి పాన్ ఇండియాలో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొందుతాడు.

అలాగే రామ్ కూడా మరోసారి మాస్ హీరోగా తనను తాను ఎస్టాబ్లిష్ చేసుకోగలుగుతాడు.

ఒక హిట్టు వల్ల ఇద్దరి కెరియర్లు సెట్ అవుతాయనే చెప్పాలి.

సూపర్ స్టార్ మహేష్ బాబు ఆ సినిమాకు రెమ్యునరేషన్ తీసుకోలేదా.. మంచి హీరో అంటూ?