సంక్రాంతి పండుగప్పుడు పిల్లలకు భోగి పండ్లు ఎందుకు పోస్తారు?

సంక్రాంతి పండుగ అప్పుడు చిన్న పిల్లలకు రేగు పండ్లు, పూలు, నాణేలను, చెరుకు గడలు కలిపి తలపై పోయడం ఆనవాయితీగా వస్తోంది.

దాన్ని చాలా మంది ఓ వేడుకలా నిర్వహిస్తారు.అసలు పిల్లలకు అలా రేగు పండ్లు ఎందుకు పోస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.

భోగి పండ్లు అంటే రేగు పండ్లు.సంక్రాంతి సూర్యునికి ప్రీతి పాత్రమైన పండుగ.

సూర్యుని రూపం, రంగు, పేరు కల్గిన రేగు పండ్లతో నాణేలు, పూలు, చెరుకు గడలను కలిపి పిల్లల తలపై పోస్తారు.

సూర్య భగవానుడి అనుగ్రహం పిల్లలపై ప్రసరించి ఆరోగ్యం కలగాలని సంకేతంతో భోగి పండ్లు పోస్తారు.

అంతే కాకుండా ఆ సూర్యుడి దయ వల్ల భోగ భోగ్యాలు కలగాలని కూడా అలా చేస్తుంటారు.

ముందుగా పిల్లలకు తలంటు స్నానం చేయించి కొత్త బట్టలు అందంగా ముస్తాబు చేస్తారు.

ఆ తర్వాత చాప వేసి పూలతో డెకరేషన్ చేసి.చాపలో పీటలు వేసి కూర్చోబెడతారు.

"""/"/ ఆ తర్వాత ముత్తుయిదువులు అంతా బొట్టు పెట్టి భోగి పండ్లు పోస్తారు.

ఆ తర్వాత మిఠఆయిలు పంచి పెడతారు.ఎనిమిది, తొమ్మిది ఏళ్లు వచ్చే వరకు పిల్లలకు ఇలా చేస్తుంటారు.

చాలా మంది ఐదేళ్ల వరకు మాత్రమే అలా చేసినా కొందరు పిల్లలపై ఇష్టంతో కొంచెం పెద్దయ్యే వరకు కూడా ఈ వేడుకను నిర్వహిస్తారు.

ఒకప్పుడు కొన్ని ప్రాంతాల్లోని కొందరు మాత్రమే భోగి పండ్ల వేడుక చేసే వాళ్లు.

కానీ ఈ కాలంలో అందరూ ఈ వేడుకను అంగరంగ వైభవంగా చేసుకుంటున్నారు.పండుగను సంబురంగా చేసుకుంటున్నారు.

డాకు మహారాజ్ ట్రైలర్ రిలీజ్ అప్పుడేనట.. గేమ్ ఛేంజర్ ను మించి బాలయ్య మెప్పిస్తాడా?