లారీల వెనుక రాసే “OK” వెనుక ఇంత సంగతి ఉందా..?

మీరు ఎప్పుడన్నా ఆటో వెనుక గాని, లారీ వెనుక గాని రాసే కొటేషన్స్ ఎప్పుడన్నా చదివారా.

భలే విచిత్రంగా ఉంటాయి కదా.కొన్ని నవ్వు తెప్పించేలాగా ఉంటే మరికొన్ని లవ్ ఫీల్ అయ్యేలాగా, కొన్ని బాధ కలిగించేలాగా ఉంటాయి కదా.

అయితే కొద్ది సేపు ఆ కొటేషన్స్ గురించి పక్కన పెడితే లారీ వెనుకాల " హార్న్, ఓకే ప్లీజ్ " అని రాసి ఉంటుంది మీరు ఎప్పుడన్నా గమనించారా.

? హార్న్ ప్లీజ్ అంటే అర్ధం తెలుసు మరి మధ్యలో ఈ ఓకే అర్ధం ఏంటో మీకు తెలుసా.

? చాలా మందికి దీని అర్ధం తెలియదు.అందుకే అసలు హార్న్ ఓకే ప్లీజ్ అనే పదం యొక్క అర్థం ఏంటి.

? ఎందుకు కొన్ని వాహనాల వెనుక ఇలా నోట్ రాస్తారు.అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

చరిత్రలో ఉన్న ఓ కధనం ప్రకారం రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ట్రక్స్ మీద ఓకే (OK) అని రాసేవారట.

ఓకే అంటే " ఆన్ కిరోసిన్ " అని అర్థం అంట.అంటే ఆ వాహనం కిరోసిన్ మీద నడుస్తోందన్నమాట.

అందుకే కోరొసిన్ తో నడిచే వాహనాల వెనుక ఇలా ఒక హెచ్చరిక లాగా OK అని రాసేవారట.

"""/"/ ఇలా కిరోసిన్ తో నడిచే వాహనాల నుండి అనుకోకుండా ఒక చిన్న ఎగ్జిట్ ద్వారా కిరోసిన్ లీక్ అయ్యి పెద్ద ప్రమాదం జరగే అవకాశాలు ఉంటాయని వెనుక వచ్చే వాహనాలకు ముందుగా హెచ్చరికగా ఇలా రాసేవారట.

అలా ఈ ఓకే అనే నోట్ ఇప్పటి వరకు పాటిస్తున్నారు.ఇదే హార్న్ ఓకే ప్లీజ్ వెనకాల ఉన్న అర్థం.

అలాగే కొన్ని వాహనాల వెనుక OTK అని కూడా రాసేవారు.

అంటే ఓవర్ టేక్ అని అర్ధం అన్నమాట.వెనుక వచ్చే వాహనాలు హార్న్ కొట్టి ముందు వాహనాన్ని ఓవర్ టేక్ చేయమని అర్ధం.

మహేష్ బాబు తో సినిమా చేయలేను అని చెప్పేసిన స్టార్ డైరెక్టర్… కారణం ఏంటంటే..?