ప్రభుత్వ భూమిలో నిర్మాణాలు జరిగితే ఏం బాధ..?: మంత్రి రోజా

విశాఖలోని రుషికొండ పర్యాటక శాఖకు సంబంధించిన ప్రభుత్వ భూమి అని మంత్రి రోజా అన్నారు.

రుషికొండపై పర్యాటక శాఖకు 69 ఎకరాల భూమి ఉందన్నారు.నిర్మాణాల కోసం ప్రభుత్వానికి అనుమతులు ఇచ్చారని తెలిపారు.

2.7 ఎకరాల్లోనే నిర్మాణాలు చేపడుతున్నామని మంత్రి రోజా అన్నారు.

ఏడు భవనాలకు అనుమతులు వస్తే నాలుగు భవనాలు నిర్మిస్తున్నామని తెలిపారు.ప్రభుత్వ భూమిలో ప్రభుత్వ భవనాలు కడుతుంటే చంద్రబాబు, పవన్ కు వచ్చిన బాధ ఏంటో అర్థం కావడం లేదన్నారు.

రుషికొండ నిర్మాణాలపై హైకోర్టు కమిటీ పరిశీలించిందన్న మంత్రి రోజా తనిఖీలు చేసి రిపోర్ట్ కూడా కమిటీ ఇచ్చిందని తెలిపారు.

ఈ క్రమంలో కోర్టు ఏమైనా సూచనలు చేస్తే తామే పాటిస్తామన్నారు.రుషికొండ నిర్మాణాలు చట్టబద్ధంగా జరుగుతున్నాయని మంత్రి రోజా స్పష్టం చేశారు.

కమల్ హాసన్ భారతీయుడు 3 తో మరోసారి నట విశ్వరూపాన్ని చూపించబోతున్నాడా..?