వంగవీటి రాధాకి దారేది...ప్రశ్నగా మారిన రాధా భవిష్యత్తు..?

కోపం వచ్చినప్పుడు ఆ కోపాన్ని తీర్చుకోగల శక్తి ఉంటేనే ప్రదర్శించాలి లేకపోతే అసలుకే మోసం వస్తుంది ఇదే ఇప్పుడు రాధాకి ఎదురయిన సమస్య ఈ సమస్యతో సతమతమవుతున్నాడు వంగవీటి రాధా అసలు వైసీపీలో విజయవాడ సెంట్రల్ టిక్కెట్టు దక్కదని తెలిసిన క్షణంలో కొంచం శాంతంగా ఆలోచన చేసి సైలెంట్ గా ఉండి ఉంటే రాధా భవిష్యత్తు కి ఒక మార్గం కనిపించేది అయితే అనుచరులు చేసిన హడావిడి వైసీపీ ని వదిలేస్తామనే గాలి కబుర్లు రాధా కి ఎటూ దారిలేకుండా చేశాయి.

వివరాలలోకి వెళ్తే . Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ వైసీపీ నుంచీ సెంట్రల్ టిక్కెట్టు మల్లాది విష్ణు కి ఇవ్వడంతో రాధా గత కొంతకాలంగా ఎంతో సైలెంట్ అయ్యారు టీడీపీ నుంచీ ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న బొండా ఉమకే వచ్చే ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ సీటు ఇవ్వనున్నారట దాంతో ఇప్పుడు రాధా ఎంట్రీ కి తెలుగుదేశం పార్టీలో కూడా అడుగు పెట్టకుండా పోయింది.

ఒక వేళ అవకాశం ఉన్నా రాధా వర్గంలో చాలా మంది వ్యతిరేకించే పరిస్థితి ఉండేది.

ఇక రాధా కి ఒకే ఒక దారి జనసేన పార్టీ అయితే ఇక్కడ కూడా రాధా కి ఊహించని ట్విస్ట్ ఎదురయ్యింది విజయవాడ సెంట్రల్ తరుపున బరిలోకి దిగడానికి ఎవరూ లేరని అనుకుంటున్నా తరుణంలో రాధా ఎంట్రీ ఇద్దమనుకునే సమయానికి విజయవాడ సెంట్రల్ జనసేన అభ్యర్ధిగా కోగంటి సత్యం పేరు వినిపిస్తోందట అయితే ఈ పేరు దాదాపు ఖరారు అయ్యిందనే అంటున్నారు దాంతో రాధా కి జనసేన నుంచీ కూడా తలుపులు మూసుకుపోయినట్టేనని తెలుస్తోంది.

అయితే ఎలాగైనా పవన్ ని ఒప్పించాలని బలం కూడగాట్టుకుంటున్న రాధా కి ఇక్కడే అసలైన ట్విస్ట్ ఎదురయ్యిందట.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ ఇంతకీ ఆ ట్విస్ట్ ఏమిటంటే.

రాబోయే రోజుల్లో జనసేన ,వామపక్షాలు కలిసి పోటీ చేస్తాయనే విషయం అందరికీ తెలిసిందే అయితే రాధా జనసేన ఎంట్రీ ఇస్తే జనసేన తరుపున సెంట్రల్ సీటు అడుగుతాడని ఊహించిన వామపక్షాలు ముందుగానే సెంట్రల్, పశ్చిమలో మేము పోటీ చేస్తామనే డిమాండ్ తెలిపారట దాంతో ఒక్క సారిగా రాధా ఆశలపై వామపక్షాలు నీళ్ళు జల్లినట్టు అయ్యింది.

దాంతో ఇప్పుడు రాధా కి ఏమి చేయాలో తెలియక కొంతకాలం సైలెంట్ గా ఉండటమే బెటర్ అనే ధోరణిలోకి వచ్చేశాడట.

అయితే రాధా భవిష్యత్తు పై ఇప్పట్లో ఎలాంటి నిర్ణయం ప్రకటించే అవకాశం లేదని తేల్చి చెప్పారట రాధా అనుచరులు .

భూములపై చంద్రబాబు దుష్ప్రచారం.. సీఎం జగన్ ఫైర్