ముద్రగడ 'రాజకీయ ముద్ర' ఎలా ఉండబోతోంది ...?

కాపులను బీసీల్లో చేర్చాలంటూ.ఉద్యమం చేపట్టి బాగా పాపులర్ అయిన కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రాజీకీయంగా రంగంలోకి దిగేందుకు సిద్ధం అవుతున్నాడు.

ఒకవైపు ఎన్నికల సమయం దగ్గరకు వచ్చేస్తుండడంతో.ఏదో ఒక నిర్ణయం తప్పనిసరిగా తీసుకోవాల్సిన పరిస్థితి.

ఈ అంశంపై ఆయన అనుచరులు తీవ్రస్థాయిలో వత్తిడి తెస్తుండడంతో.ఆయన కూడా తనకు అనుకూలమైన పార్టీ కోసం వేచి చూస్తున్నాడు.

కాపు రిజర్వేషన్స్ పై అన్ని పార్టీలు దాటవేసే ధోరణిలో ఉండడంతో ఇప్పుడు ఉద్యమించినా ప్రయోజనం ఉండదు కనుక రాజకీయంగా ఏదో ఒక పదవిలో ఉంటే రిజర్వేషన్స్ అంశంపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవడానికి బాగుంటుందని ముద్రగడ ఆలోచన.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ ముఖ్యంగా ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు ముద్రగడను రాజకీయాలవైపు తీసుకెళ్తున్నాయి.

గత కొద్దిరోజులుగా ఏపీలో ప్రధాన పార్టీలు కాపు సామాజిక వర్గాన్ని దూరం పెట్టే ప్రయత్నాలు చేస్తుందన్న అనుమానాలు ఆ సామాజిక వర్గం నేతల్లో వ్యక్తమవుతోంది.

అధికార తెలుగుదేశం పార్టీ కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిఅక్కడితో మా పని అయిపొయింది అన్నట్టుగా ఊరుకుంది.

చంద్రబాబు కాపు రిజర్వేషన్లు అమలుకాకపోవడాన్ని కేంద్రంపై నెపాన్ని నెట్టే ప్రయత్నం చేస్తున్నారు తప్ప అందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయడం అన్న అభిప్రాయంలో ముద్రగడ ఉన్నారు.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ ఇక ప్రతిపక్ష నేత జగన్ కూడా.

రిజర్వేషన్ల అంశం తమ పరిధిలో లేదని, కేంద్రం వల్లనే సాధ్యమవుతుందని చెప్పేశారు.అప్పటి వరకూ వైసీపీతో దోస్తీ కొనసాగించినట్టు కనిపించిన ముద్రగడ చివరకు జగన్ హ్యాండ్ ఇవ్వడంతో ఆ పార్టీపై నిప్పులు చెరిగారు.

ఇక ఈ రెండు పార్టీలు కాపులను మోసం చేశాయని భావనలో ముద్రగడ ఉన్నారు.

ఈ నేపథ్యంలో తమ సమస్యలు పరిష్కారం కావాలంటే జనసేనకు జై కొట్టాల్సిందేనని ముద్రగడపై వత్తిడి ప్రారంభమయింది.

పవన్ కల్యాణ్ కు అండగా నిలబడాలన్న డిమాండ్ ఆ సామాజికవర్గం నుంచి పెరుగుతోంది.

జనసేన ఎక్కువ సీట్లు సాధించగలిగితే కర్ణాటకలో మాదిరిగా కింగ్ మేకర్ అయ్యే అవకాశముందని, అప్పుడు కాపు రిజర్వేషన్లు సాధ్యమవుతాయని ముద్రగడపై వత్తిడి తెస్తున్నారు.

ఆయన కూడా జనసేనలో చేరేందుకు సిద్దంగానే ఉన్నట్టు కనిపిస్తున్నారు.

పవన్ కోసం రేణు ఇంత పెద్ద సినిమా నుంచి తప్పుకుందా ? బద్రి సినిమా తర్వాత ఏం జరిగింది ?