తెలంగాణ విషయంలో ఏం చేద్దాం ..? నాయకులతో జనసేన ప్రత్యేక భేటీ !

దేశమంతా జనసేన విస్తరించాలని ప్రకటించిన ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసే విషయంలో మాత్రం ఎటూ తేల్చుకోలేకుండా ఉన్నాడు.

పోటీ చేస్తే ఎలా ఉంటుంది చెయ్యకపోతే ఎలా ఉంటుంది అనే విషయంలో ఏ క్లారిటీ తెచ్చుకోలేకుండా ఉన్నాడు.

అసలు ఇప్పటికే ఏదో ఒక స్పష్టమైన క్లారిటీ తెచ్చుకోవాలి ఉండగా నాన్చుడు ధోరణితో విమర్శలపాలయ్యారు.

ఇప్పటికే తెలంగాణాలో ఉన్న రాజకీయ పార్టీలు .అభ్యర్తుల ఎంపిక, ఎన్నికల ప్రచారంతో దూసుకు పోతున్నాయి.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ తెలంగాణాలో జనసేన పోటీ చేసితీరాలని పవన్ అబిమానులు ఒత్తిడి పెంచడంతో కనీసం ఆస్యంగానైనా పవన్ మేల్కొన్నారు.

తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయాలా.ఒకవేళ పోటీ చేస్తే ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి.

వంటి అంశాలపై పార్టీ ముఖ్యనాయకులతో చర్చలు ప్రారంభించారు.జనసేన తెలంగాణ నాయకులు పవన్ కల్యాణ్ పై ఆ విషయంలో ఒత్తిడి పెడుతున్నారు.

కానీ పవన్ వారికి ఏ విషయం క్లారిటీగా చెప్పలేకపోతున్నాడు. Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ తెలంగాణలో కనీసం 40 శాసనసభ స్థానాలకు అభ్యర్థులను నిలబెట్టాలని తెలంగాణ నాయకులు జనసేనానిని కోరుతున్నారు.

ఈ క్రమంలోనే తెలంగాణలోని జనసేన ముఖ్య నేతలతో ఈ నెల 16న పవన్ భేటీ కాబోతున్నారట.

ఆ భేటీ అనంతరం తెలంగాణ ఎన్నికల్లో పోటీపై స్పష్టత వచ్చే అవకాశముందని తెలుస్తోంది.

సాధారణంగా ఏ రాజకీయ పార్టీ అయినా.తమ రాష్ట్రంలో ఎన్నికల నగారా మోగడానికి కనీసం ఒకటి రెండు నెలల ముందే పోటీ చేసే అంశంపై ఓ క్లారిటీతో ఉంటుంది.

కాని జనసేన మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా సాగుతోంది.

కాకినాడలో ప్లాంట్ .. రూ.1000 కోట్ల పెట్టుబడి పెట్టనున్న కోరమాండల్ ఇంటర్నేషనల్