పూరి జగన్నాధ్ కు హీరో దొరికేది ఎప్పుడు.. ఆయన కథ మెచ్చేది ఎవరు?
TeluguStop.com
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాద్ ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వత మళ్లీ కెరీర్ లో పుంజుకుంటాడు.
వరుసగా విజయాలు సొంతం చేసుకుంటాడు అని అంతా భావించారు.ఇస్మార్ట్ శంకర్ తర్వాత పూరి జగన్నాద్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం లైగర్.
ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ పరాజయాన్ని మూట కట్టుకుంది.కనీసం పెట్టుబడి కూడా వెనక్కు రాబట్టలేక పోయింది.
పూరి జగన్నాధ్ లైగర్ సినిమా చేస్తున్న సమయంలోనే విజయ్ దేవరకొండతో జనగనమణ అనే సినిమాను ప్రకటించాడు.
ఆ సినిమా ఇప్పుడు లేదు అని తేలిపోయింది.విజయ్ దేవరకొండ మరియు పూరి కాంబో మూవీ అంటే ఏ ఒక్కరు నమ్మే పరిస్థితి లేదు.
అందుకే ఇప్పుడు పూరి మరో సినిమా కోసం వెయిట్ చేస్తున్నాడు.ఆ మధ్య సల్మాన్ ఖాన్ తో కూడా సినిమాను చేసేందుకు పూరి జగన్నాధ్ రెడీ అవుతున్నాడు అంటూ ప్రచారం జరిగింది.
ఆ విషయంలో ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి స్పష్టత రాలేదు.కానీ ఇప్పటి వరకు పూరి జగన్నాధ్ ఏ ఒక్క హీరోను కూడా ఒప్పించలేక పోయాడు.
"""/"/
అసలు ఆయన దర్శకత్వంలో సినిమా ఈ ఏడాది ప్రారంభం అయ్యే అవకాశం ఉందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
సోషల్ మీడియాలో పూరి జగన్నాధ్ కు ఉన్న ఫాలోయింగ్ ఇప్పటికి కూడా అలాగే ఉంది.
ఆయన అభిమానులు కచ్చితంగా ఒక భారీ బ్లాక్ బస్టర్ ను చేస్తాడు అంటూ అంతా నమ్మకంగా ఉన్నారు.
కానీ హీరోలు మాత్రం కమర్షియల్ విషయాలను దృష్టిలో పెట్టుకని పూరి పై నమ్మకం పెట్టుకోలేక పోతున్నారు.
ముందు ముందు అయినా ఏ ఒక్క హీరోను అయినా పూరి జగన్నాద్ మెప్పించలేక పోతాడా అనేది చూడాలి.
రవితేజ మరియు పూరి ల కాంబోలో అద్భుతమైన సినిమాలు వచ్చాయి.కనుక వీరిద్దరి కాంబో లో మరో సినిమా రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.
అది ఎంత వరకు సాధ్యం అవుతుంది అనేది చూడాలి.
కీర్తి సురేష్ సినిమాలకు గుడ్ బై చెప్పనుందా.. వైరల్ అవుతున్న వార్తల్లో నిజమెంత?