”తండేల్” అంటే ఇంత అర్ధం ఉందా.. చైతూ ఈసారి కొడదామనే ఫిక్స్ అయ్యాడుగా!

అక్కినేని యువ హీరోల్లో నాగ చైతన్య ( Naga Chaitanya ) ఒకరు.

అక్కినేని హీరోగా ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుని కెరీర్ ను ముందుకు సాగిస్తున్న చైతూకు ఈ మధ్య మళ్ళీ వరుస ప్లాపులు పలకరిస్తున్నాయి.

మజిలీ తర్వాత మళ్ళీ ఆ రేంజ్ లో హిట్ పడలేదు.బంగార్రాజు హిట్ అయినా అంతగా కలెక్షన్స్ రాబట్టలేక పోయింది.

తాజాగా వచ్చిన కస్టడీ( Custody ) కూడా చైతును ప్లాప్స్ నుండి బయట పడేయలేక పోయింది.

నాగ చైతన్య వరుస ప్లాప్స్ తర్వాత ఇప్పుడు తన కెరీర్ లో ప్రేమమ్, సవ్యసాచి వంటి సినిమాల హిట్స్ ఇచ్చిన చందు మొండేటి దర్శకత్వంలో తన నెక్స్ట్ సినిమా చేస్తున్నాడు.

ఇటీవలే ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. """/" / ''NC23'' అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కనున్న ఈ సినిమాలో నాగ చైతన్య సరసన సాయి పల్లవి మరోసారి నటిస్తుంది.

ఇప్పటికే ఈ జంట లవ్ స్టోరీ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది.దీంతో ఈ హిట్ పెయిర్ మరోసారి జోడీ కట్టనుంది.

ఇదిలా ఉండగా మొన్న చైతూ పుట్టిన రోజు నాడు ఈ సినిమా నుండి టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ ను రివీల్ చేసారు.

"""/" / ఈ 'సినిమాకు 'తండేల్''( Tandel ) అనే టైటిల్ పెట్టిన విషయం తెలిసిందే.

ఈ టైటిల్ విన్నప్పటి నుండి అంత ఈ టైటిల్ అంటే అర్ధం ఏంటా అని తెగ ఆరా తీస్తున్నారు.

మరి తండేల్ అంటే అర్ధం ఏంటంటే నాయకుడు, కెప్టెన్ అట.ఎలాంటి భయం, బెరుకు లేనివాడు అని అలాంటి యోధుడినే తండేల్ అంటరాని తెలుస్తుంది.

టైటిల్ తోనే ఆకట్టుకున్న ఈ చిత్రంపై ఆడియెన్స్ అంచనాలు పెట్టుకున్నారు.తండేల్ అంటే శక్తివంతమైన, ఆకర్షణీయమైన, ఏకాగ్రత అని అర్ధం.

మరి తండేల్ ఎలా ఆకట్టు కుంటుందో చూడాలి.

దేవర పోస్టర్ పై భారీ ట్రోల్స్… ఆ హీరోల సినిమాలను కాపీ కొట్టారంటూ కామెంట్స్!