మానసిక పూజ అంటే ఏమిటి ?
TeluguStop.com
మనస్సుతోనే నిర్వహించే పూజను మానస పూజ అని అంటారు.కాల కృత్యాలు తీర్చుకుని, స్నానం చేసి శుభ్రంగా ఉండాలి.
తర్వాత ఎవరూ డిస్టర్బ్ చేయని, ఏకాంత ప్రదేశంలో కూర్చోవాలి.తర్వాత పూర్తిగా మనస్సును కేంద్రీకరించి ఈ పూజ చేయాలి.
ఈ మనసు పూజలో ఇంద్రీయాలను నిగ్రహించుకోవడం చాలా చాలా ముఖ్యం.మందిరం, విగ్రహం, పూజా సామగ్రి వగైరాలు మానస పూజలో ఉండవు.
పూజ చేయాలని తపించే వారు మనస్సులోనే వీటన్నింటిని కల్పించుకుంటారు.మానసికంగా కల్పించుకొన్న మందిరం లోని గర్భ గృహంలో రత్న కచితమైన అష్ట దళ పీఠంలో ఇష్ట దేవతను ఆవాహనం చేసుకోవాలి.
సిద్ధాసనస్థుడై దేవతా మూర్తిపై చిత్తం నిలిపి శాంత సుందర కరుణా మూర్తిగా ఆ స్వరూపాన్ని భావించాలి.
పూజా సామగ్రిని కూడా మనస్సుతోనే కల్పించుకొని అభిషేకాలనూ మానసికంగా నిర్వహించాలి.పూజ చేసే సమయంలో మంత్రాలు తప్పనిసరిగా జపం చేయాలి.
ధూప దీప హారతులు మున్నగు క్రియలన్నీ మనస్సులోనే జరపాలి.నైవేద్యం సమర్పించిన తరువాత దేవతా మూర్తిని తదేక నిష్ఠతో ధ్యానించాలి.
ఇష్ట దేవత తన ఎదుట ప్రత్యక్షమై నట్లు భావించాలి.వైరాగ్యం, భక్తి, విశ్వాసం కల్గిన వారు ఏ స్థలంలో ఉన్నప్పుడు అయినా ఈ మానస పూజను నిర్వహించవచ్చు.
ఎటు చూసినా దేవతా మూర్తి ప్రత్యక్షమయ్యే పర్యంతం ఈ పూజను భక్తి శ్రద్ధలతో చేసి పూజ సిద్ధించినట్లు పూజలో మరొక ప్రక్రియ కూడా ఉంటుంది.
శరీరం క్షేత్రమనీ భావించాలి.విజన ప్రదేశంలో ఇంద్రియాలను నిగ్రహించి సుఖాసనంలో కూర్చొని ధ్యానించడమే ఈ పూజా విధానం.
అదానిపై బాబు చర్యలు తీసుకుంటారా ? ఒత్తిడి పెరుగుతోందా ?