విగ్రహారాధన చేయడానికి గల కారణం ఏమిటో తెలుసా?

సాధారణంగా మనం ఏదైనా ఆలయాలను దర్శించి నప్పుడు ఆలయాలలో మనకు విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి.

ఈ విధంగా ఆలయంలో ప్రతిష్ట చేయబడిన విగ్రహాలకు మనం పూజ చేయడం ఆనవాయితీగా వస్తోంది.

ఈ విధంగా విగ్రహాలకు పూజ చేయటం ఎన్నో సంవత్సరాల నుంచి ఒక ఆచారంగా వస్తోంది.

ఈ క్రమంలోనే ఎన్నో విగ్రహాలు స్వయంభూగా వెలిసిన విధంగా మరికొన్ని దేవ దేవతలు, రాజుల చేత ప్రతిష్టించబడినవిగా ఉన్నాయి.

అయితే కేవలం విగ్రహారాధన చేయడానికి గల కారణం ఏమిటి? ఈ విధంగా విగ్రహారాధన చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం.

విగ్రహం అంటే విశేషంగా గ్రహించేది అని అర్థం.భగవంతుడిలో ఉన్న శక్తిని గుణాలను రూపాన్ని విగ్రహం ఎంతో విశేషంగా గ్రహించబడి తనలో నిక్షిప్తం చేసుకుంటుంది.

ఈ క్రమంలోనే భక్తులు భక్తిభావంతో విగ్రహాలను పూజించడం వల్ల మన కోరికలు నెరవేరుతాయి.

ఈ క్రమంలోనే విగ్రహాలను వివిధ రకాల పదార్థాలతో తయారుచేస్తారు.కొందరు పంచలోహాలతో తయారు చేయగా మరికొందరు మట్టి, చెక్కలతో ఈ విగ్రహాలను తయారుచేస్తారు.

ఈ క్రమంలోనే భక్తులు ఏ ఏ రూపంలో నైనా భక్తిభావంతో తనని పూజించడంవల్ల అది తన రూపంగా భావించి భక్తులు చేసే పూజలను స్వామివారి స్వీకరిస్తారు.

""img Src=" " / ఆలయాలలో ప్రతిష్టించబడిన విగ్రహాలు అనేవి ఒక శక్తివంతమైన అడ్డం వంటివి.

ఇటువంటి విగ్రహాలను పూజించడం వల్ల మన భావాలను స్వీకరించి అనేక రెట్లు అధికం చేసి తిరిగి మనకు ప్రసాదిస్తుంది.

ఇదిలా ఉండగా  ఏకలవ్యుడు విలువిద్య నేర్చుకోవడం కోసం ద్రోణాచార్యుడి విగ్రహాన్ని ప్రతిష్టించి ఆయన ముందు భక్తిశ్రద్ధలతో విలువిద్యను నేర్చుకోవడం మనం వినే ఉంటాం.

ప్రతిమలోని గురువు ఉన్నాడని పాటించిన ఏకలవ్యుడు విలువిద్యలో అర్జునుడుకి మించి విల్లు కారుడిగా ఎదిగాడు.

అందుకోసమే మనం భక్తి భావంతో పూజించే ఏ ఆకారంలో నైనా స్వామి వారు కొలువై ఉండటం వల్ల పూర్వ కాలం నుంచి ఈ విధంగా విగ్రహారాధన చేయడం ఆనవాయితీగా వస్తోంది.

ఆత్మహత్య చేసుకునే స్థితిలో ఉన్నా.. దయచేసి సాయం చేయండి.. పావలా శ్యామల ఎమోషనల్!