పొట్ట చుట్టు కొవ్వుకి, విట‌మిన్ `సి` కి లింకేటో తెలుసా?

పొట్ట చుట్టు కొవ్వుకి, విట‌మిన్ `సి` కి లింకేంటో తెలుసా?

పొట్ట చుట్టు కొవ్వు లేదా బెల్లీ ఫ్యాట్‌ స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా చాలా మంది కామ‌న్‌గా ఫేస్ చేస్తున్న స‌మ‌స్య ఇది.

పొట్ట చుట్టు కొవ్వుకి, విట‌మిన్ `సి` కి లింకేంటో తెలుసా?

ఆహార‌పు అల‌వాట్లు, శ‌రీరానికి శ్ర‌మ లేక‌పోవ‌డం, ఒకే చోట గంట‌లు త‌ర‌బ‌డి కూర్చోవ‌డం, మారిన జీవ‌న‌శైలి, ఆల్కహాల్, స్మోకింగ్ ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల పొట్ట చుట్టు కొవ్వు పేరుకుపోతుంది.

పొట్ట చుట్టు కొవ్వుకి, విట‌మిన్ `సి` కి లింకేంటో తెలుసా?

ఫ‌లితంగా శ‌రీర ఆకృతి చూసేందుకే అస‌హ్యంగా మారుతుంది.ఇక అప్పుడు బెల్లీ ఫ్యాట్‌ను క‌రిగించుకునేందుకు నానా ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు.

వ్యాయామాలు చేస్తారు డైట్‌లు ఫాలో అవుతారు.ఇష్ట‌మైన స్వీట్స్‌కు, ఫాస్ట్ ఫుడ్స్‌కు దూరం అవుతారు.

ఇలా ఎన్నో చేస్తారు.అయిన‌ప్ప‌టికీ కొంద‌రిలో పొట్ట చుట్టు కొవ్వు కాస్తైనా క‌ర‌గ‌దు.

అందుకు కార‌ణం విట‌మిన్ సి నే.అస‌లు ఇంత‌కీ విట‌మిన్ సి కి, పొట్ట చుట్టు కొవ్వుకు లింకేంటీ ? అన్న సందేహం మీకు వ‌చ్చే ఉంటుంది.

తొంద‌ర ప‌డ‌కండి.నేనూ అక్క‌డికే వ‌స్తున్నా.

సాధార‌ణంగా విట‌మిన్ సి అంటే ఇమ్యూనిటీ ప‌వ‌ర్‌ను పెంచ‌డానికి మాత్ర‌మే ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని చాలా మంది భావిస్తారు.

"""/" / కానీ, అలా అనుకోవ‌డం చాలా పొర‌పాటు.నిజానికి మెద‌డు చురుగ్గా ప‌ని చేయాల‌న్నా, మ‌ధుమేహం రాకుండా ఉండాల‌న్నా, క్యాన్స‌ర్ క‌ణాలు వృద్ధి చెంద‌కూడ‌ద‌న్నా, ఎముక‌లు బ‌లంగా మారాల‌న్నా విట‌మిన్ సి ఎంతో అవ‌స‌రం.

అలాగే శరీర బరువును క్రమబద్ధీకరించడంలోనూ విటమిన్ సి కీల‌క పాత్ర పోషిస్తుంది.ఇక ఎన్ని చేసినా బ‌రువు త‌గ్గ‌డం లేదు, ఎన్ని పాటించినా బెల్లీ ఫ్యాట్ క‌ర‌గ‌డం లేదూ అంటే.

మీరు విట‌మిన్ సి ని తీసుకోవ‌డం లేద‌ని అర్థం.శ‌రీరంలో విట‌మిన్ సి త‌క్కువగా ఉన్నా.

స‌న్న‌గా స‌న్న‌జాజిలా ఉండే మీ పొట్ట బాన పొట్ట‌లా త‌యార‌వుతుంది.కాబ‌ట్టి, పొట్ట చుట్టు కొవ్వు పేరుకోకుండా ఉండాల‌న్నా, పేరుకుపోయిన కొవ్వు క‌ర‌గాల‌న్నా ఖ‌చ్చితంగా విటమిన్ సి ఫుడ్స్‌ను డైట్‌లో చేర్చుకోవాలి.

నారింజ‌, నిమ్మ‌, ద్రాక్ష‌, స్ట్రాబెర్రీలు, కివి, ట‌మాటాలు, బొప్పాయి, క్యాప్సిక‌మ్‌, బ్రకోలీ, మొలకలు, కాలీఫ్లవర్ వంటి వాటిలో విట‌మిన్ సి స‌మృద్ధిగా ఉంటుంది.

వీటిని డైట్‌లో చేర్చుకుంటే.బెల్లీ ఫ్యాట్‌ను త్వ‌ర‌గా త‌గ్గించుకోవ‌చ్చు.

ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద అవసరమైన వసతులు కల్పించాలి