షర్మిల ఉదంతం నేర్పుతున్న పాఠం ఏమిటి?
TeluguStop.com
నిజానికి దేశ రాజకీయాలలో మహిళల ప్రాతినిధ్యం పురుషుల తో పోలిస్తే తక్కువే అయినప్పటికీ అచంచలమైన పట్టుదల ,వ్యూహా నిపుణత తో దేశ రాజకీయాల్లో తమదైన ముద్ర వేసిన మహిళా మణులు సంఖ్య కూడా తక్కువేమీ కాదు .
దేశ చరిత్ర లోనే అత్యంత శక్తివంతమైన ప్రదాని గా పేరుగాంచిన ఉక్కు మహిళ ఇందిరా గాంధీ( Indira Gandhi ) గురించి ఇప్పటికి కదలు గా చెప్పుకుంటారు.
అలాగే సోనియా గాంధీ, సుష్మా స్వరాజ్ ,జయలలిత మాయావతి ,మమతా బెనర్జీ, ఇలా చెప్పుకుంటూ పోతే దేశ రాజకీయాల్లో కీలకమైన పాత్ర పోషించిన మహిళా మణుల స్థానం కూడా తక్కువ లేదు.
అయితే రాజకీయం లో విజయవంతం అవ్వడానికి బలమైన సంకల్పం తో పాటు పోరాటానికి అవసరమైన ప్రధాన భూమిక ఎంచుకోవడం కూడా అంతే ముఖ్యం.
వైఎస్ఆర్టీసీ అధ్యక్షురాలు( YSRTC ) ఈ విషయంలోనే తప్పటడుగు వేసినట్లుగా కనిపిస్తుంది.
చట్టప్రకారం దేశం లో ఎక్కడైనా పోటీ చేసే అర్హత ఆమెకు ఉన్నా ఆ ప్రాంత ప్రజలతో మమేకం అవ్వడానికి ఏదో ఒక సారూప్యత ఉండడం కూడా అంతే ముఖ్యం .
నిజానికి ఆమె చేసినంత సుదీర్ఘ పాదయాత్ర ఇంతవరకు దేశంలో ఏ మహిళా రాజకీయ నేతా చెయ్యలేదు, ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో తన అన్న జగన్ కోసం సుదీర్ఘ పాదయాత్ర చేసిన షర్మిల, తెలంగాణలో కూడా తన పార్టీ గుర్తింపు కోసం 2000 కిలోమీటర్లు పైగా పాదయాత్ర చేసి రికార్డులకు ఎక్కారు .
"""/" /
అయితే ఆమే తన రాజకీయ( Political ) క్షేత్రాన్ని తప్పుగా ఎంచుకోవడమే ఆమె రాజకీయ జీవితం తెలంగాణలో అర్ధాంతరంగా ముగిసిపోవడానికి కారణమని అభిప్రాయం వినిపిస్తుంది .
వైయస్సార్ కుమార్తెగా ఆమెకు తెలంగాణలో కూడా అభిమానులు ఉన్నారు.అయితే తెలంగాణ ఏర్పడిన తర్వాత భౌగోళిక విభజనతో పాటు మానసికంగా కూడా ఒక విభజన రేఖ ఈ రెండు ప్రాంతాల ప్రజల మద్య స్పష్టంగా కనిపిస్తుంది .
ప్రస్తుత పరిస్థితులలో సీమాంధ్ర వ్యక్తులకు చెందిన పార్టీలు తెలంగాణ లో ఉనికి చాటుకోవడం దాదాపు అసాధ్యం అనే చెప్పాలి .
అయినా కూడా అనువు కానీ చోట కూడా తనదైన పోరాటం చేసిన షర్మిల తెగువ ను మాత్రం అభినందించవలసిందే .
అయితే కాంగ్రెస్తో విలీన చర్చలలో కూడా ఆమె పదవి మాత్రమే కోరుకుంటే చెప్పుకోదగ్గ రాజకీయ పదవి దొరికి ఉండేది కానీ తెలంగాణలోనే రాజకీయంగా ఎదగాలనుకోవడం ఆమెకు ప్రధాన ఇబ్బందిగా మారింది.
"""/" / దాంతో కాంగ్రెస్( Congress ) పక్కన పెట్టినట్లుగా వ్యవహరించడంతో ఆమెకు ఉన్న దారులు అన్నీ మూసుకుపోయాయి .
ఇప్పుడు చివరికి పోటీ చేయడానికి అభ్యర్థులు కూడా లేని పరిస్థితుల్లో ఆమె పోటీ నుంచి విరమించుకొని కాంగ్రెస్కు మద్దతు తెలపడం తో ఇక దాదాపు వైఎస్ఆర్టిపి తెలంగాణ రాజకీయాల నుంచి అదృశ్యమైనట్లే భావించాలి .
అయితే ఇప్పటికీ షర్మిలకు మంచి అవకాశమే ఉంది.ఆంధ్ర రాజకీయాల పట్ల కనుక ఆమె ఉత్సాహం చూపితే రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వడానికి కాంగ్రెస్ ఇప్పటికీ సిద్ధంగానే ఉంది, కాబట్టి ఆమెకు మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పే అవకాశం వస్తుంది.
పైగా పుట్టిన నేల కాబట్టి ఆమె అర్హత విషయం అసలు సమస్య కూడా కాదు .
అయితే ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ఆమె నిర్ణయం తీసుకోలేనట్లే ఉంది మరి బలమైన పట్టుదల ,పోరాటం చివరికి ఇలా ముగిసిపోవటం మాత్రం విషాదం అనే చెప్పాలి .
తెలుగు వాళ్ళతోనే మాకు పోటీ అంటున్న తమిళ్ డైరెక్టర్స్…