వైసీపీ నేతల భాష ఎలాంటిది?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడిన పరుష పదజాలపై అవనిగడ్డ బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఏమిటా బూతులు?ఏమిటా చెప్పులు? అంటూ తిట్లలో వీది రౌడీలను మించిపోయారు.

వీది రౌడీలు కూడా అలా మాట్లాడుతారో లేదో నాకు తెలియదు.దారుణమైన బూతులు మాట్లాడే నాయకులు మనకు అవసరమా? అంటూ నీతి వాచకం వినిపించారు జగన్.

ఇటువంటి పవిత్ర నాయకులు ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నారా అనుకొంటారు.ముఖ్యమంత్రి బూతులు పై నీతులు చెప్పడం చూసి, విని గురివిందలు కూడా సిగ్గుపడుతున్నాయి.

జగన్ బూతులు గురించి నీతులు చెబుతుంటే మానవత్వం బతుకు జీవుడా అని పారిపోతుంది.

మీలో ఇంత గొప్ప భావాలున్నాయా ముఖ్యమంత్రి గారు?మీరు,మీ మంత్రులు,ఎమ్మెల్యేలు,ఎంపీలు తిట్టే తిట్లు అన్నమయ్య కీర్తనలు అని,ఇతరులు తిడితే బూతులు అని చెప్పదలుచు కొన్నారా? ఆంధ్రప్రదేశ్ లో బూతుల యూనివర్సిటీకి అంకురార్పణ చేసింది మీరు,మీ మంత్రులు కాదా?ఈ రోజు బూతులు పై సుభాషితాలు వినిపిస్తున్నారు.

ప్రతిపక్షంలో వున్నప్పుడు కానీ,మూడున్నరేళ్లుగా అధికారంలో వుండి మీరు,మీ నాయకులు నోటితో చెప్పలేని,రాయలేని భాషతో ఏ విధంగా చంద్రబాబును,ఆయన కుటుంబాన్ని తిట్టిపోస్తున్నారో ప్రపంచం అంతా చూస్తున్నారు.

చంద్రబాబు ను మీ పార్టీ నాయకులు తిట్టిన తిట్లు విని ప్రజలు చెవ్వులు మూసుకున్నారు.

బూతులు పై జగన్ మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు వుంది.రాక్షసులు రామాయణం వినిపించినట్లుంది.

తిరుపతి గుడి నీయమ్మ మొగుడు కట్టించాడా అని చంద్రబాబుని మంత్రి కొడాలి అన్నారు.

అసెంబ్లీ లోను వికృతంగా మాట్లాడారు.చంద్రబాబు అసలు నీవు మనిషివేనా అని, నీ కళ్ళకు గుడ్డి వచ్చిందా అని,పిచ్చికుక్క,గజ్జికుక్క అని,కుక్కబతుకు అని,ఎర్రగడ్డకు తీసుకుపోవాలని ఇలా ఎన్నోతిట్లు ఇష్టాను సారం రాయడానికి కూడా ఇబ్బందిగా వున్న భాషతో తిట్టిపోశారు.

అన్నం తింటున్నావా,గడ్డి తింటున్నావా అని మంత్రి వెల్లం పల్లి అన్నారు.నువ్వు సాయిబు కే పుట్టావా అని కౌన్సిల్ చైర్మన్ షరీఫ్ ను ఉద్దేశించి మంత్రి బొత్సా అన్నారు.

రాయలసీమలో అయితే కూలగొట్టడం కాదు ,కూనీ చేసే వాళ్ళమని వైసిపి ఎమ్మెల్యే రఘురామిరెడ్డి అన్నారు.

కాళ్ళు విరగ గొడతామన్నారు మంత్రి బాలి నేని.ఈ విధంగా ముఖ్యమంత్రి జగన్,మంత్రులు,ఎమ్మెల్యేలు తిట్టిన తిట్లకు ఎం సమాధానం చెబుతారు ముఖ్యమంత్రిగారు? పదవి లేని పవన్ కళ్యాణ్ ఒక్కసారి మాట్లాడినందుకే గింజుకొంటున్నారే,ఎనిమిదేళ్లుగా చంద్రబాబును తిట్టిన తిట్లు తిట్టకుండా తిడుతున్నారే అయన ఎవరికీ చెప్పుకోవాలి? ఆయన మనిషికాదా?ఆయనకు ఆత్మాభిమానం లేదా? ఆమధ్య ఒకసారి మీకు మీరు రాజ్యాంగాధిపతిగా అభివర్ణించుకొన్నారే,మరి గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రి గా,ప్రతిపక్ష నాయకుడుగా రాజ్యాంగాధిపతి కాదా? ప్రతి పక్షనాయకుడు చంద్రబాబు వున్నది రాజ్యాంగబద్ధ పదవిలో కాదా? పదవిలో లేని పవన్ కళ్యాణ్ నాలుగు మాటలు అన్నందుకు వీధి రౌడీ అని,ఇటువంటి నాయకులు అవసరమా అంటున్నారే, రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాజ్యాంగ దేవాలయం అసెంబ్లీలో,బయట బూతులు మాట్లాడే నాయకులు రాష్ట్రానికి అవసరమా? మీరు ఏకంగా ప్రతిపక్షాన్ని తిట్టడానికే మిమ్మల్ని పెట్టుకున్నానని మీరే చెప్పిన విషయాన్ని ఒక సారి గుర్తు తెచ్చుకొండి.

"""/"/ జగన్.మూడున్నరేళ్లుగా రాష్ట్రంలో ప్రతిపక్షం సహేతుక విమర్శ చేసినా,సహేతుక సూచన చేసినా సహించలేని దుర్భుద్ధి నిలువెల్లా నింపుకున్న ముఖ్యమంత్రి జగన్,మంత్రులు నోటికి ఏది వస్తే అదే దుర్భాషలు ఆడినవారు ఇప్పుడు మాకు మించిన పవిత్రులు లేరన్న విధంగా బూతులు అంటూ నీతులు చెప్పడం సిగ్గు చేటు.

నీతులు మాటున రోత రాజకీయాలు చేస్తున్నారు.తమ కంట్లో దూలాలను దాచిపెట్టి ఇతరుల కంట్లో నలుచులు చూపించి రాజకీయ ప్రయోజనం పొందాలని తపిస్తున్నారు ముఖ్యమంత్రి జగన్.

జగన్ మద్దతు ఇవ్వకపోతే… బీజేపీ టార్గెట్ వారే ?