అనిల్ రావిపూడి డైరెక్షన్ లో రామ్ మిస్ చేసుకున్న సినిమా ఇదేనా.. ఏం జరిగిందంటే?
TeluguStop.com
టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి( Anil Ravipudi ) గురించి మనందరికీ తెలిసిందే.
ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో అపజయం ఎరుగని దర్శకుడిగా రాణిస్తూ దూసుకుపోతున్నారు.ఇప్పటివరకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన సినిమాలన్నీ బాక్సర్స్ వద్ద సూపర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే.
అందులో భాగంగానే ఇటీవల చివరిగా సంక్రాంతికి వస్తున్నాం( Sankranthiki Vasthunnam ) సినిమాతో ప్రేక్షకులను పలకరించిన అనిల్ రావిపూడి ఈ సినిమాతో మరో సూపర్ హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకున్నారు.
సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా ఇప్పటికే 250 కోట్ల గ్రాస్ ని దాటి 300 కోట్లకు చేరువలో ఉంది.
ఇకపోతే నెక్స్ట్ చిరంజీవితో సినిమా చేయబోతున్నారు అనిల్.అయితే గతంలో అనిల్ రావిపూడి హీరో రామ్( Hero Ram ) తో ఒక సినిమా చేయాలి.
ఈ సినిమాని అధికారికంగా ప్రకటించారు.కానీ పలు కారణాలతో ఆ సినిమా ఆగిపోయింది.
అనిల్ రావిపూడి రామ్ చేసిన కందిరీగ, మసాలా, పండగ చేస్కో సినిమాలకు రచయితగా పనిచేసారు అనిల్ రావిపూడి.
రెండు సినిమాల తర్వాత రాజా ది గ్రేట్( Raja The Great ) సినిమా మొదట రామ్ తోనే చేయాలనుకున్నాడట.
కథ కూడా ఓకే అయి ప్రొడక్షన్ కూడా మొదలయ్యాక ఆ సినిమా ఆగిపోయింది.
ఆ కథనే కాస్త మార్చి తర్వాత రవితేజతో( Ravi Teja ) చేసారు.
అయితే రామ్ అలాగే అనిల్ రావిపూడి మధ్య ఒక ఇష్యూ ఉందని వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.
ఇదే విషయం గురించి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు అనిల్ రావిపూడి. """/" /
రామ్ తో నాకు ఎలాంటి ఇష్యుస్ లేవు.
రామ్ నాకు చాలా క్లోజ్.కందిరీగ సినిమా నుంచి నాకు పరిచయం.
మంచి ఫ్రెండ్.రామ్ తో నేను రాజా ది గ్రేట్ సినిమా చేయాలి.
రవితేజ కంటే ముందు రాజా ది గ్రేట్ సినిమా రామ్ కే చెప్పాను.
రామ్ కూడా ఓకే అన్నాడు.అప్పుడు రాజా ది గ్రేట్ కథ కొంచెం వేరు.
రవితేజతో చేసిన కథ వేరు.రామ్ తో లవ్ ప్లస్ యాక్షన్ అనుకున్నాము.
విజువల్లీ ఛాలెంజెడ్ పర్సన్ ప్రేమలో పడి ఆ తర్వాత ఆ అమ్మాయికి ఒక ప్రాబ్లమ్ వస్తే ఏం చేసాడు అనే కథ రామ్ తో చేయాలి అనుకున్నాను.
"""/" /
మొదట ప్రొడక్షన్ కంపెనీతో కొన్ని సమస్యలు వచ్చాయి.అది సెట్ అయ్యేలోపు అప్పుడే రామ్ హైపర్ సినిమా( Hyper Movie ) రిలీజయింది.
దాంతో అప్పుడే బ్యాక్ టు బ్యాక్ కమర్షియల్, యాక్షన్ సినిమాలు చేయడానికి రామ్ ఆలోచించారు.
అనిల్ మనం తర్వాత చేద్దాం నాకు బ్యాక్ టు బ్యాక్ యాక్షన్ చేయాలని లేదు అని చెప్పారు.
నేను కూడా ఓకే అన్నాను.ఇద్దరం ఓకే అనుకొనే ఆ ప్రాజెక్టు నుంచి బయటకు వచ్చాము.
అంతే కానీ ఆయనకు నాకు ఏ గొడవలు లేవు.సెట్ అవ్వాల్సిన సినిమా అదే.
అప్పుడు ఆగిపోయింది మరి మళ్ళీ రామ్ తో ఎప్పుడు చేస్తానో చూడాలి.రాజా ది గ్రేట్ రిలీజయ్యాక కూడా ఫోన్ చేసి కూడా మాట్లాడారు రామ్ అని తెలిపారు అనిల్ రావిపూడి.