శివరాత్రి వస్తుందంటే చాలు భక్తులు ఉపవాసాలు చేసేందుకు.ఆలయాలకు వెళ్లేందుకు ముందు నుంచే ఏర్పాట్లు చేసుకుంటారు.
రకరకాల పండ్లు కొనుక్కొచ్చి స్వామి వారికి పూజ చేస్తారు.పండ్లను నైవేద్యంగా పెట్టి.
భక్తులు కూడా వాటినే ప్రసాదంగా తీసుకుంటారు.అయితే శివ అంటే శంకరుడు.
వీరిద్దరి కలయికే శివరాత్రి.శివ పార్వతులకు కల్యాణం జరిగిన రాత్రే శివరాత్రి.
వీరికి ముందు వివాహమైన దంపతులు ఎవరూ లేరు.వారి కంటే ముందు పెళ్లైన వాళ్లు పురాణాల్లో కనిపించరు.
అందుకే పార్వతీ పరమేశ్వరులను ఆది దంపతులుగా కీర్తిస్తారు.శివ పార్వతుల కల్యాణం జగత్తు కళ్యాణానికి నాంది అయింది కాబట్టే శివరాత్రి విశ్వానికి పండుగ రోజు అయింది.
అందుకే శివరాత్రిని హిందువులంతా పెద్ద పండుగగా చేసుకుంటారు.మరి కొన్ని రోజుల్లో ఈ పండుగ వచ్చేస్తోంది.
అలాగే శివరాత్రి రోజుకు ఇంకో ప్రత్యేకత కూడా ఉంది.అదేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఒకరోజు బ్రహ్మ, విష్ణువు తమలో ఎవరు గొప్ప అనే విషయంలో గొడవ పడతారు.
వారి గొడవ చిలికి చిలికి గాలి వానలా మారుతుంది.ఈ వాగ్వాదం ప్రళయంగా మారుతుండటంతో ఈశ్వరుడు వస్తాడు.
వారిద్దరి మధ్య తేజోలింగంగా ఉద్భవించి, వారికి జ్ఞానాన్ని ఉపదేశించింది కూడా శివ రాత్రి రోజే అని చెబుతుంటారు.
అందుకే మాఘ బహుళ చతుర్దశి రోజు అర్ధరాత్రి సమయాన్ని లింగోద్భవ కాలంగా భావిస్తారు.
అందుకే ఆ రోజు శివారాధనలు, శివార్చనలు చేయడం పూర్వ కాలం నుంచి ఆనవాయితీగా వస్తోంది.