ఆపద మొక్కులవాడు, ఏడు కొండల వాడికి నిత్యం వేలాది పూలతో పూజలు చేస్తుంటారు. ప్రత్యేక కార్యక్రమాలప్పుడు ఆ సంఖ్య లక్షలకు, కోట్లకు చేరుతుంది.
బ్రహ్మోత్సవాల సమయంలో ఆ సంఖ్య అంతకు మించే ఉంటుంది. మరి వాటన్నింటిని పూజల అనంతరం ఏం చేస్తారు.
ఇదే డౌట్ చాలా మందికి వస్తుంది. పూలను, పూల మాలలను ఎవరికీ ప్రసాదంగా ఇచ్చే సాంప్రదాయం తిరుమలలో లేదు.
అందువల్ల ఆ పవిత్ర పూలను ఆలయంలోని ఓ బావిలో వేస్తారు. దానినే పూలబావి అంటారు.
పూల బావికి మరో పేరుంది. అదే భూతీర్థం.
పూర్వం తిరుమల క్షేత్రంలో భూదేవి చేత ఏర్పరబడిన ఈ తీర్థం కాలాంతరంలో నిక్షిప్తమై పోయింది.
అనంతరం శ్రీనివాసుని ఆనతిపై రంగ దాసు అనే భక్తులు ఒక బావిని త్రవ్వగా భూ తీర్థం మళ్ళీ వెలుగులోకి వచ్చింది.
ఆపద సంభవించినప్పుడు తొండమానుడు ఈ పూలబావి రహస్య మార్గం ద్వారానే శ్రీనివాసుడ్ని శరను వేడాడు.
స్వామి వారు ఆ సమయంలో ఏకాంతంగా ఉన్నారు. తొండమానుడ్ని చూసి శ్రీమహాలక్ష్మి సిగ్గుతో శ్రీమహా విష్ణువు వక్షస్ధలంలో చేరితే, భూదేవి తొండమానుడు కట్టించిన పూలబావిలోకి వెళ్లి దాక్కుందని వరాహ పురాణం చెబుతోంది.
"""/" /
అందుకే శ్రీనివాసునికి అలంకరించి తొలగించిన నిర్మాల్యాన్ని భూదేవి కోసమే ఈ బావిలో వేసేలా నిర్ణయించారని శ్రీ వేంకటాచల ఇతిహాస గ్రంథం వెల్లడిస్తోంది.
అప్పటి నుంచి నిత్యం శ్రీవారికి అలంకరించిన తులసి, పూల మాలలను పూలబావిలో వేస్తున్నారు. కానీ సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే, అదీ తిరుచానూరులో జరిగే కార్తీక బ్రహ్మోత్సవ సమయంలో మాత్రమే తిరుచానూరు పంచమీ తీర్థం రోజున శ్రీవారికి అలంకరించిన పూలు, పసుపు కుంకమలు, పరిమళ ద్రవ్యాలు, చీర, రవికలు, లడ్డూలు, వడలు తదితర ప్రసాదాలు సహా మిగతావన్నీ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి కానుకగా సమర్పిస్తారు.
వీడియో: హార్దిక్ పాండ్య ఇదేం సిగ్గులేని పని.. నివాళి సమయంలో నవ్వుతావా..?