బ్రహ్మ ముహూర్తం అని ఏ సమయాన్ని అంటారో మీకు తెలుసా..?
TeluguStop.com
సాధారణంగా మనం ఏవైనా పూజలు, వ్రతాలు చేసేటప్పుడు బ్రహ్మ ముహూర్తంలో చేయాలి అనే పదాన్ని వినే ఉంటాం.
అసలు బ్రహ్మ ముహూర్తం అంటే ఏమిటి? చిన్నప్పటి నుంచి ఈ పదాన్ని ఎక్కువ సార్లు వింటూ ఉన్నా దీనికి సరైన అర్థం మాత్రం చాలామందికి తెలియదు.
బ్రహ్మ ముహూర్తం అంటే చాలామంది తెల్లవారుజామున అని భావిస్తుంటారు.కానీ బ్రహ్మ ముహూర్తం అంటే ఖచ్చితమైన సమయం అనేది ఒకటి ఉంటుంది.
ఆ కచ్చితమైన బ్రహ్మ ముహూర్తం ఎప్పుడు ఉంటుంది?ఆ బ్రహ్మ ముహూర్తం లో ఎలాంటి పనులు చేయటం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనే విషయాలను గురించి ఇక్కడ తెలుసుకుందాం.
బ్రహ్మ ముహూర్తం అంటే ప్రతి రోజు సూర్యోదయానికి 40 నిమిషాలు ముందు ఉన్న సమయాన్ని కచ్చితమైన బ్రహ్మముహూర్తం అని తెలియజేస్తూ ఉంటారు.
ఉదాహరణకు ఈ రోజు సూర్యోదయం 6:30 అయితే 5:42 నిమిషాల నుంచి 6 గంటల 30 వరకు బ్రహ్మ ముహూర్తం అని చెప్పవచ్చు.
ఈ 48 నిమిషాల సమయంలో పూజలు, వ్రతాలు, నోములు చేయటానికి ఎంతో పవిత్ర సమయమని వేద పండితులు చెబుతున్నారు.
అంతేకాకుండా ప్రతిరోజు బ్రహ్మ ముహూర్త సమయంలో నిద్రలేవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయని చెబుతారు.
"""/" /
బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవటం వల్ల సూర్యుడి నుంచి వెలువడే లేలేత కిరణాలు మనపై ప్రచురించడం వల్ల అధిక మొత్తంలో విటమిన్ డి శరీరానికి పొందవచ్చు.
ఈ సమయంలో వాతావరణంలోని ఆక్సిజన్ స్వచ్ఛంగా ఉంటుంది.అదేవిధంగా విద్యార్థులను బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి చదువుకోవడం వల్ల బాగా జ్ఞాపకం ఉంటుందని చెబుతుంటారు.
ఈ బ్రహ్మ ముహూర్తంలో ఎలాంటి శబ్దాలు ఉండకపోవడం వల్ల మన శ్రద్ధ మొత్తం చదువు పై ఉంటుంది.
అలాగే రాత్రి సమయంలో పడుకోవడం వల్ల మన పై ఎలాంటి ఒత్తిడి లేకుండా ఉండటం ద్వారా బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి చదవటం ద్వారా చదివినవి బాగా గుర్తు ఉంటాయని చెప్పవచ్చు.
ఈ విధంగా ప్రతిరోజు సూర్యోదయానికి 48 నిమిషాల ముందు ఉన్న సమయాన్ని బ్రహ్మ ముహూర్తం అంటారు.
పంచదార కాదు బాస్.. బెల్లం టీ తాగితే అదిరిపోయే ఆరోగ్య లాభాలు మీ సొంతం!