ఏ దేవాలయానికి ఏ సమయం లో వెళ్ళితే మంచి జరుగుతుందో తెలుసా?

ఉదయాన్నే దైవదర్శనం మంచిదని మనందరికీ తెలిసిన విషయమే.దేవాలయాలను దర్శించడం వల్ల మనసుకు ప్రశాంతత చేకూరుతుంది.

అంతేకాక కోరికలు నెరవేరుతాయి.అయితే శాస్త్ర ప్రకారం సూచించిన సమయాలలో దేవాలయాలను దర్శించడం వలన అధిక ఫలితాన్ని మరియు మంచి ఫలితాన్ని పొందవచ్చు.

స్థితి కారుడైన శ్రీమహావిష్ణువు ఆలయాన్నీ,శ్రీ రామునీ, ఆంజనేయుని ఆలయాలని లేదా ఏ వైష్ణవ ఆలయాన్నైనా ఉదయాన్నే దర్శించుకోవాలి.

నిత్య జీవనంలో మనకు ఎదురయే అనేక సమస్యలు, ఆపదలను రూపుమాపే శ్రీమన్నారాయణుని ఆ ప్రత్యక్ష నారాయణుడైన సూర్య భగవానుడు ప్రకాశిస్తుండగా దర్శించుకోవడం అత్యంత శుభస్కరం.

లయకారకుడు, ధ్యానమూర్తి అయిన శంకరుడిని ఆయన అనుచర గణాలనూ రాత్రివేళ లేదా సాయం సమయాలలో దర్శించాలి.

పరమ శివుడు మనస్సుకు అధిపతి, జగద్గురువు.అటువంటి శివుణ్ణి చంద్రుడు వచ్చిన తరువాత దర్శించుకోవడం వల్ల మనస్సు అదుపులో ఉంటుంది.

దీనికి కారణం చంద్ర కిరణాలు మానవుని శరీరం లో రక్తప్రసరణ పై (బి.పి.

) నేరుగా ప్రభావం చూపుతాయి.చంద్రుడు ఆకాశం లో ఉండగా బుద్ధికి మనసుకూ అధిపతి అయిన శంకరుని ధ్యానించడం వల్ల చంద్ర కాంతి మన మనసుపై మంచి ప్రభావాన్ని చూపి, ఏకాగ్రత,జ్ఞాపక శక్తి, బుద్ధికుశలత పెరుగుతాయి.

అమ్మవారి ఆలయాలను దర్శించడానికి ప్రత్యేక సమయమంటూ ఉండదు.ఆమె త్రిలోకాలకూ అమ్మ కనుక అమ్మను ఏ వేళలో అయినా దర్శించవచ్చు,ధ్యానించవచ్చు.

విశ్వంలో గ్రహాంతరవాసులు ఉన్నారా? జేమ్స్ వెబ్ టెలిస్కోప్ కొత్త డిస్కవరీ..!