ఖతార్ లో వున్న ఆ కృత్తిమ ద్వీపం గొప్పతనం ఏంటి? ప్రజలు ఎందుకు ఎగబడుతున్నారు?

ఖతార్ దేశం అనేక కట్టడాలకు ప్రత్యేకాలకు నెలవు.ఇక్కడ వృత్తాకారంలో నిర్మించిన ఇళ్ల చుట్టూ ఫౌంటెన్‌లు, వాటి మధ్య నుంచి తక్కువ వెడల్పు ఉండే రహదారులు, వాటిపై లక్షల డాలర్ల విలువైన స్పోర్ట్స్ కార్లు మీకు ఎక్కడ చూసినా కనిపిస్తుంటాయి.

ప్రజలు ఇక్కడ విలాసవంతమైన విల్లాలు లేదా అపార్ట్‌మెంట్‌లలో జీవిస్తూ వుంటారు.20-25 అంతస్థులు వరకు ఉండే ఈ భవనాల్లో స్విమ్మింగ్ పూల్, జిమ్, ప్రైవేట్ బీచ్ వంటి ప్రత్యేకమైన సదుపాయాలు ఉంటాయి.

ఇక్కడ సౌదీ అరేబియా అమ్మాయిలు, ఒక లెబనాన్ రెస్టారెంట్‌కు వెళ్లిన కొద్ది క్షణాలకే తల నుంచి హిజాబ్‌ను తొలగించడం విశేషం.

స్లీవ్ లెస్ కుర్తీలు, పొట్టి స్కర్టులు వేసుకొనే మహిళలు ఇక్కడ అనేకమంది కనిపిస్తూ ఉంటారు.

‘‘లా పెర్లా’’ అనేది ఖతార్‌లోని ప్రముఖ నిర్మాణ సంస్థ.ఈ సంస్థ ఓ కృత్రిమ ద్వీపాన్ని ఇక్కడ నిర్మించింది.

దీని కోసం 4 మిలియన్ చదరపు మీటర్ల సముద్రాన్ని వీరు ఉపయోగించుకున్నారు.ఖతార్‌ దేశానికి చెందని వ్యక్తులు కూడా ఈ ప్రాపర్టీని కొనుగోలు చేసే తొలి పట్టణ ప్రాజెక్టు అని చెబుతూ వుంటారు.

ఇక్కడ 25 వేల నివాస గృహాలు వున్నాయి.కాగా ప్రస్తుతం 33 వేల మంది ఇక్కడ నివసిస్తున్నారు.

ఇక్కడ స్టూడియో హౌస్ ఖరీదు 3 మిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో సుమారు రూ.

24.5 కోట్లు.

"""/"/ ఇక్కడ సదుపాయాలు చూస్తే సామాన్యుడికి దిమ్మతిరుగుతుంది.సముద్రానికి అభిముఖంగా ఉండే 5 బెడ్‌రూమ్‌ల విల్లా 12 మిలియన్ డాలర్లట.

అంటే మన ఇండియన్ కరెన్సీలో సుమారు రూ.100 కోట్లుకు పైనే ఉంటుంది.

అందుకే ఇక్కడికి సంపన్నులు క్యూలు కడుతూ వుంటారు.ఆకాశం నుంచి చూసినప్పుడు ఈ ద్వీపం ఒక ముత్యం ఆకారంలో కనిపించడం విశేషం.

ఇక్కడ అనేక రెస్టారెంట్లు, విలాసవంతమైన హోటళ్లు, షాపింగ్ మాల్స్, బార్లు, సినిమా హాళ్లు కలవు.

ప్రపంచ కప్‌లో పాల్గొంటున్న అమెరికా జట్టు ఇక్కడి ఒక లగ్జరీ హోటల్‌లోనే బస చేయడం విశేషం.

సూర్యాపేట కాంగ్రెస్ లో మరోసారి వర్గ విభేదాలు