‘ కోడెల ‘ వారసుడి ఆవేదనేంటి ? సత్తెనపల్లి టీడీపీ లో ఏం జరుగుతోంది ? 

తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా చంద్రబాబుకు అత్యంత సన్నిహితులుగా పేరుపొందిన మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మరణాంతరం సత్తెనపల్లి నియోజకవర్గంలో టిడిపి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు కోడెల శివప్రసాద్ , ఆయన తనయుడు శివరామ్.

వారినే టార్గెట్ చేసుకుని వైసిపి ప్రభుత్వం అనేక చర్యలకు దిగడం, శివప్రసాద్ మరణం తర్వాత కోడెల శివరాం( Kodela Sivaram ) కూడా అనేక కేసుల్లో ఇరుక్కోవడం  వంటివి జరిగాయి.

"""/" / ఇక రాబోయే ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసే ఆలోచనతో కోడెల వారసుడు శివరాం ఉన్నారు.

అయితే రాబోయే ఎన్నికల్లో ఆయనకు టిక్కెట్ దక్కే అవకాశం లేనట్టుగానే ప్రస్తుత పరిస్థితి కనిపిస్తోంది.

  దీనికి తగ్గట్లుగానే ఇటీవల టిడిపిలో చేరిన సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ ఈ నియోజకవర్గంలో నుంచి పోటీ చేసే ఆలోచనతో ఉన్నారు .

ఈయనకు టికెట్ ఇచ్చేందుకు చంద్రబాబు సైతం సముకంగా ఉండడంతో,  కోడెల వారసుడి ఆవేదన అంతా అంతా కాదు.

"""/" / ఇటీవల చంద్రబాబు( Chandrababu Naidu ) ఈ నియోజకవర్గంలో పర్యటించారు.

  ఈ సందర్భంగా పార్టీ కీలక నేతలంతా హాజరయ్యారు .కానీ ఆ సమయంలో అందుబాటులో లేని కారణంగా కోడెల శివరాం ఆ సమావేశానికి రాలేదు.

ఆ సమావేశం ప్రారంభానికి ముందే ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించిన నేతలు అక్కడ కోడెల విగ్రహాన్ని ఏర్పాటు చేయడం మర్చిపోయారు.

అయితే ఈ వ్యవహారంపై కోడెల శివరం తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.మీడియా ముందుకు వచ్చి మరి తన ఆవేదనను వ్యక్తం చేశారు.

  మేము చేసిన నేరం ఏమిటి ?  పార్టీ కోసం ప్రాణాలర్పించిన నాయకుడిని విమర్శిస్తారా ఇదెక్కడి న్యాయం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

"""/" / మా నాన్న కోడెల శివప్రసాద్( Kodela Siva Praasad Rao ) పేరు వినిపించకుండా సత్తెనపల్లెలో కుట్ర జరుగుతోందని , దీని వెనుక ఎవరున్నారో నాకు ఇప్పుడే తెలియాలి అంటూ శివరాం ఫైర్ అయ్యారు.

అధికార పార్టీ నుంచి తనకు ఎన్ని రకాలు ఇబ్బందులు ఎదురైనా,  అన్ని భరిస్తున్నామని , తండ్రి స్థానంలో ఉన్న చంద్రబాబు న్యాయం చేయాలని శివరాం కోరుతుండగా,  రాబోయే ఎన్నికల్లో ఆయనకు టిక్కెట్ ఇచ్చే అవకాశం లేదనే సంకేతాలు వెలబడడంతోనే కోడెల వారసుడు ఈ విధంగా ఫైర్ అవుతున్నారనే ప్రచారం పార్టీ వర్గాల్లో జరుగుతోంది.

దేవర బెనిఫిట్ షో టికెట్ ధర తెలిస్తే  గుండె ఆగిపోవాల్సిందే.. ధర ఎంతంటే?