వైరల్ వీడియో: ఆ బాల్ తగిలుంటేఆ అంపైర్ గతి ఏమిటి..?!
TeluguStop.com
ప్రస్తుతం జరుగుతున్న టీ 20 వరల్డ్ కప్ లో భాగంగా ఆస్ట్రేలియా -పాకిస్థాన్ ల మధ్య జరిగిన సెమీ ఫైనల్ లో ఆన్ ఫీల్డ్ అంపైర్ గా వ్యవహరించిన ఐసీసీ అంపైర్ క్రిస్ గఫానికి పెద్ద ప్రమాదమే తప్పింది.
నవంబర్ 11 గురువారం నాడు జరిగిన ఫైనల్ టికెట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా బౌలర్ మిచెల్ స్టార్క్ వేసిన డెత్ ఓవర్లో పాకిస్థాన్ బ్యాటర్ ఫకర్ జమాన్ కొట్టిన ఓ బంతి నేరుగా అంపైర్ తల మీద నుంచి బౌండరీ వైపుకు దూసుకెళ్లింది.
ప్రమాదాన్ని అంచనా వేసి అంపైర్ గఫాని వెంటనే సమయస్ఫూర్తితో క్షణాల్లో కింద పడిపోయి తప్పుకున్నాడు.
లేదంటే అత్యంత వేగంగా వచ్చిన ఆ బాల్ అంపైర్ తలకి తగిలి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది.
వ్యాఖ్యాత బాజిద్ ఖాన్ ఈ వీడియోని చూసి ఆ షాట్ ను రెగ్యులర్ గా అభివర్ణించారు అంటే ప్రమాదం తీవ్రత ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు.
ఇక మ్యాచ్ విషయానికొస్తే.తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 20 ఓవర్లలో 176 పరుగులు చేయగా ఫఖర్, మహమ్మద్ రిజ్వాన్ ఇద్దరు అర్థ సెంచరీలు చేశారు.
రిజ్వాన్ 52 బంతుల్లో 67 పరుగులు, ఫకర్ జమాన్ 32 బంతుల్లో 55 పరుగులు చేశారు.
కెప్టెన్ బాబర్ ఆజమ్ కూడా 39 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. """/"/ అయితే భారీ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఆసీస్ కి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది.
సెమీఫైనల్ మ్యాచ్ లో కీలక ఇన్నింగ్స్ ఆడిన డేవిడ్ వార్నర్ 30 బంతుల్లో 49 పరుగులు, గ్లెన్ మాక్స్ వెల్ కూడా కేవలం 7 పరుగులు చేసి అవుటయ్యారు.
అదే సమయంలో కెప్టెన్ ఆరోన్ ఫించ్ - 0, స్టీవ్ స్మిత్ -5, మిచెల్ మార్స్ 28 పరుగులు చేయగా, షాదాబ్ ఖాన్ 4 ఓవర్లలో కేవలం 26 పరుగులు ఇచ్చి కీలకమైన 4 వికెట్లు తీసి కంగారూ జట్టును కష్టాల్లో పడేసాడు.
కానీ చివరిలో స్టోయినీస్ 40 ( 17 బంతులలో, 2 ఫోర్లు, 2 సిక్సులు) అద్భుత ఆట తీరుతో పాకిస్థాన్ విజయ గర్వాన్ని అణచి వేసి ఆస్ట్రేలియాను ఫైనల్ చేర్చారు.
ఎలా వస్తాయి ఇలాంటి ఆలోచనలు.. కొత్త ఆలోచనతో చేపలను ఎంత సులువుగా పట్టేస్తున్నారో