భక్తి, ఆధ్యాత్మికానికి తేడా ఏమిటో తెలుసా?

భక్తి, ఆధ్యాత్మికం అంటే రెండు ఒకటే అంటారు చాలా మంది.కానీ భక్తికి, ఆధ్యాత్మికానికి చాలా తేడా ఉంటుందని పండితులు చెబుతుంటారు.

 భగవంతుని మనసా, వాచా స్మరిస్తూ మనల్ని మనం ఆయనకు అర్పించుకోవడమే భక్తి.ఏమీ ఆశించకుండా, కేవలం ఆ భగవంతుడిని స్మరించడమే భక్తి అంటే.

రాముడిపై ఆంజనేయస్వామికి ఉండేది భక్తి అంటారు.పరమేశ్వరుడిపై నందీశ్వరునికి ఉండేది భక్తి.

భగవత్ తత్వం తెలుసుకున్న వారికి భక్తి గుండెల లోతుల నుంచి వస్తుంది.భక్తి అంటే శ్రద్ధ, దేవునిపై లేదా మనం నమ్మిన గురువులపై అచంచల విశ్వాసం, నమ్మకం ఉండాలి.

భక్తి అంటే ప్రధానంగా కర్మ కాండలకు సంబంధించినదని పండిత నిపుణులు అంటారు.పూజలు, వ్రతాలకు సంబంధించినది భక్తి అంటే.

ఆధ్యాత్మికత అంటే పూర్తిగా జ్ఞానానికి చెందినది.మహోన్నతం, అనంతం, అంతిమం అయిన స్వేచ్ఛ వైపు చేసే ప్రయాణమే ఆధ్యాత్మికత.

భగవంతునికి భజన చేసుకున్నా, స్మరించుకున్నా.భక్తికి సరి పోతుంది.

కానీ దాంతోనే పూర్తిగా జ్ఞానం వచ్చేస్తుందని ఏమాత్రం చెప్పడానికి వీలు లేదు.ఆధ్యాత్మికత అంటే గ్రంథాలు, ఉపషనిత్తులు, వేదాలు చదవడం వల్ల జ్ఞానం వస్తుంది.

లేదా అవి చదివిన వారు బోధిస్తుంటే వాటిని వినడం వల్ల కూడా జ్ఞానం సిద్ధిస్తుంది.

"""/" / నేను ఎవరు అనే ప్రశ్నకు అసలైన సమాధానం తెలుసుకోవడమే ఆత్మ జ్ఞానం అంటారు.

ఆత్మ జ్ఞానమే ఆధ్యాత్మికతకు అంతిమ లక్ష్యం.దానికి ఆధ్యాత్మికత దారిలో జ్ఞానం పొందడమే  అత్యంత అవసరం.

తప్పించే భక్తితో, పూజలు, వ్రతాలతో ఆత్మ జ్ఞానాన్ని పొందలేము.భక్తితో చిత్త శుద్ధి ఏర్పడుతుంది.

చిత్త శుద్ధి అంటే మనసులో ఉండే అన్ని చెడు ఆలోచనలు వెళ్లిపోతాయి.అంతే కానీ మంచి ఆలోచనలు ఉండటం కాదు.

మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ మీట్ …ఎన్టీఆర్ చేతిలో బాటిల్……అసలేం తాగుతున్నారు?