ప్రస్తుతం ఈ మూడు పార్టీల పరిస్థితి ఏంటంటే ? 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్ ,కాంగ్రెస్, బిజెపిలో( BRS Congress BJP ) స్పీడ్ పెంచాయి.

ఇప్పటికే కొన్ని నియోజకవర్గాలు మినహా అభ్యర్థుల ప్రకటనను పూర్తిచేశాయి.ఇక ఎన్నికల ప్రచారంపైనే ప్రధానంగా దృష్టి సారించాయి.

ప్రస్తుతం నామినేషన్ల ప్రక్రియ మొదలైంది.మిగిలి ఉన్న స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి పూర్తిస్థాయిలో ఎన్నికల ప్రచారంపై దృష్టి సారించేందుకు అయా రాజకీయ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి.

ఈ మేరకు మూడు పార్టీలు భారీగా సభలు సమావేశాలు నిర్వహించేందుకు ఏర్పాటు చేసుకుంటున్నా.

బిజెపతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్ ,కాంగ్రెస్, బిజెపిలో స్పీడ్ పెంచాయి.

ఇప్పటికే కొన్ని నియోజకవర్గాలు మినహా అభ్యర్థుల ప్రకటనను పూర్తిచేశాయి.ఇక ఎన్నికల ప్రచారంపైనే ప్రధానంగా దృష్టి సారించాయి.

ప్రస్తుతం నామినేషన్ల ప్రక్రియ మొదలైంది.మిగిలి ఉన్న స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి పూర్తిస్థాయిలో ఎన్నికల ప్రచారంపై దృష్టి సారించేందుకు అయా రాజకీయ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి.

ఈ మేరకు మూడు పార్టీలు భారీగా సభలు సమావేశాలు నిర్వహించేందుకు ఏర్పాటు చేసుకుంటున్నా.

యి.h3 Class=subheader-styleబిజెపి/h3p """/" / బిజెపి విషయానికొస్తే రేపు హైదరాబాద్ ఎల్బి స్టేడియంలో బీసీ గర్జనను నిర్వహించేందుకు భారీగా ఏర్పాటు చేసింది.

ఈ సభకు ప్రధాని నరేంద్ర మోది( Narendra Modi ) హాజరు కాబోతుండడంతో భారీగా ఏర్పాట్లు చేశారు.

ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో సాయంత్రం 5:30 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి ప్రధాని నరేంద్ర మోది చేరుకుంటారు.

అక్కడ నుంచి నేరుగా ఎల్బీ స్టేడియం కు వెళ్లి బహిరంగ సభకు హాజరవుతారు.

ఈ సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో లక్ష మందిని ఈ సభకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తుంది.

సభ ఏర్పాట్లను ఆ పార్టీ ప్రతినిధుల బృందం ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంది .బీసీ నినాదాన్ని గట్టిగా వినిపిస్తున్న బిజెపి తాము తెలంగాణలో అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రి గా చేస్తామని ఇప్పటికే ప్రకటించింది.

H3 Class=subheader-styleకాంగ్రెస్/h3p """/" / కాంగ్రెస్ కూడా బిజెపి, బీఆర్ఎస్ లకు దీటుగా భారీగా ఎన్నికల ప్రచారానికి ప్లాన్ చేసుకుంది.

ఈనెల 9న ముస్లిం మైనారిటీ డిక్లరేషన్ ను ప్రకటించేందుకు ఏర్పాట్లు చేసుకుంటుంది .

హైదరాబాద్ లేదా నిజామాబాద్ లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి పార్టీ సీనియర్ నేత సల్మాన్ కుర్షిద్ తో మైనారిటీ డిక్లరేషన్ విడుదల చేయాలని కాంగ్రెస్ భావిస్తుంది.

అలాగే ఈనెల 10న కామారెడ్డిలో సభ ఏర్పాటు చేసి బీసీ డిక్లరేషన్ ప్రకటించాలని నిర్ణయించుకుంది.

కామారెడ్డి సభకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య ( Siddha Ramaiah )హాజరుకానున్నట్లు ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి H3 Class=subheader-style బి ఆర్ ఎస్/h3p """/" / మూడోసారి హ్యాట్రిక్ విజన్ సొంతం చేసుకోవాలని పట్టుదలతో ఉన్న తెలంగాణ అధికార పార్టీ బిఆర్ఎస్ దానికి తగ్గట్టుగానే ఏర్పాట్లు జరుగుతున్నాయి.

సీఎం కేసీఆర్ ( CM Kcr )ఈనెల తొమ్మిది వరకు రెండో విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా మరో 10 నియోజకవర్గాల్లో పర్యటించరున్నారు.

అలాగే ఈ నెల 13 నుంచి 28 వరకు మూడో విడత ప్రచారంలో భాగంగా 16 రోజులు పాటు 54 ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొంటారు .

ఈనెల 25న హైదరాబాద్ లో భారీ బహిరంగ సభ నిర్వహణకు బీఆర్ఎస్ పార్టీ( BRS ) ఏర్పాట్లు చేస్తుంది.

28న గజ్వేల్ నియోజకవర్గం లో జరిగే ప్రజా ఆశీర్వాద సభతో కేసిఆర్ ఎన్నికల ప్రచారం ముగుస్తుంది.

ఇప్పటికే తెలంగాణ లో కొన్ని కీలక నియోజక వర్గాల్లో కేటీఆర్ హరీష్ రావు పర్యటిస్తున్నారు.

మొత్తం 119 నియోజకవర్గాలను పర్యటించేందుకు పార్టీ శ్రేణుల్లో జోష్ పెంచేందుకు ఈ ఇద్దరు నాయకులకు కెసిఆర్ బాధ్యతలు అప్పగించారు .

ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞ కాంబోకి బ్రేక్ పడనుందా..? బాలయ్య దృష్టి అంతా ఆ దర్శకుడి మీద ఉందా..?