హస్త”గతం ” అయ్యే ప్లాన్ అదే !

తెలంగాణలో కాంగ్రెస్( Telangana Congress ) అధికారంలోకి రావాలని గట్టిగా ప్రయత్నిస్తోంది.ఎన్నికలకు ఎంతో సమయం లేకపోవడంతో అన్నీ విషయాల్లోనూ పక్కా ప్రణాళికతో వ్యూహాలను రచిస్తున్నారు హస్తం నేతలు.

ఇప్పటికే పార్టీలోని అంతర్గత విభేదాలకు దాదాపు చెక్ పెట్టిన హైకమాండ్.ఇక నేతలను సమన్వయ పరిచే పనిలో నిమగ్నమైంది.

అంతే కాకుండా అభ్యర్థుల ఎంపికపై కూడా తుది కసరత్తులు జరుగుతోంది., అభ్యర్థుల ఎంపిక కోసం ఇప్పటికే స్టీరింగ్ కమిటీని( Steering Committee ) ఏర్పాటు చేసిన సంగతి తేసిసిందే.

హస్తం పార్టీ వ్యూహకర్త సునిల్ కనుగోలు ఇచ్చిన సర్వే ఆధారంగా అభ్యర్థులను జల్లెడ జల్లెడ పడుతోంది స్టీరింగ్ కమిటీ.

"""/" / అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే నెలలో తొలి జాబితా అభ్యర్థులను ప్రకటించే ఆలోచనలో హస్తం నేతేలు ఉన్నారు.

ఇదిలా ఉంచితే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభావంపై సునిల్ కనుగోలు( Sunil Kanugolu ) ఇప్పటికే స్పస్తమైన సర్వేను హస్తం నేతల ముందు ఉంచారట.

ఆ సర్వే ప్రకారం 41 నియోజిక వర్గాల్లో కచ్చితంగా కాంగ్రెస్ గెలుపు అవకాశాలు ఉన్నాయట.

మరో 40 నియోజిక వర్గాలలోని 30 సీట్లలో కాంగ్రెస్ కు సానుకుంగానే ఉన్నాయని రిపోర్ట్ ఇచ్చాడట.

"""/" / దీంతో నియోజిక వర్గాల వారీగా కచ్చితంగా గెలిచే స్థానాలపై గట్టిగా ఫోకస్ చేసి అక్కడి నేతలను సమన్వయ పరుస్తూ ఓటు బ్యాంకు చిలకుండా చూసుకుంటే కచ్చితంగా గెలుపు కాంగ్రెస్ దే అని సునిల్ కనుగోలు ఇచ్చిన సర్వేలో తేలిందట.

అందుకే హస్తం నేతలు గెలుపుపై ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు.ఈ నేపథ్యంలో బలహీనంగా ఉన్న నియోజిక వర్గాలపై దృష్టి సారించడం టైమ్ వెస్ట్ ప్రసస్ అని.

ఆ సమయాన్ని కూడా గెలిచే నియోజిక వర్గాలపై వెచ్చించితే గెలుపు మరింత దగ్గరవుతుందనే ఆలోచనలో టి కాంగ్రెస్ నేతలు ఉన్నారట.

అందుకే రాష్ట్రంలోని 119 నియోజిక వర్గాలలో అభ్యర్థులను ప్రకటించినప్పటికి అందులో 80 నియోజిక వర్గాలపైనే దృష్టి పెట్టెలా హస్తం పార్టీ ప్రణాళికలు రచిస్తున్నట్లు వినికిడి.

మరి అధికారాన్ని హస్తగతం చేసుకునేందుకు కాంగ్రెస్ వేస్తున్న ప్లాన్స్ ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.

ప్రపంచంలోనే హాటెస్ట్ అథ్లెట్.. ఈ ముద్దుగుమ్మ అందాలకు ఒలింపిక్ ఫ్యాన్స్ ఫిదా..?