సిద్దు జొన్నలగడ్డ, బొమ్మరిల్లు భాస్కర్ ల పరిస్థితి ఏంటి..?
TeluguStop.com
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ యంగ్ హీరో హవా ఎక్కువగా కొనసాగుతుందనే చెప్పాలి.
ఇక ఇప్పటివరకు ఎన్ని సినిమాలు చేసిన మంచి విజయాలను సాధించుకోలేని హీరోలు కొంతమంది ఉంటే కొన్ని సినిమాలతోనే మ్యాజిక్ ని క్రియేట్ చేస్తూ ముందుకు సాగుతున్న స్టార్ హీరోలు మరి కొంతమంది ఉన్నారు అందులో సిద్దు జొన్నలగడ్డ ఒకరు.
ఇక డిజె టిల్లు( DJ Tillu ) సినిమాతో ఒక్కసారిగా పెను ప్రభంజనాన్ని సృష్టించిన ఈయన తనదైన మార్క్ చూపించడంతో పాటు మంచి విజయాన్ని దక్కించుకున్నాడు.
ఇక ఈ సినిమాతో కూడా మరోసారి పెను ప్రభంజనాన్ని సృష్టించి స్టార్ హీరోగా అవతరిస్తున్నాడు.
ఇక ఇప్పుడు బొమ్మరిల్లు భాస్కర్( Bommarillu Bhaskar ) డైరెక్షన్ లో చేస్తున్న సినిమాతో లవర్ బాయ్ ఇమేజ్ ని కూడా సొంతం చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది.
"""/" /
మరి ఆయన అనుకున్నట్టుగానే ఇప్పుడు చేసే సినిమాలతో మంచి విజయాలను సాధిస్తే తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేయడమే కాకుండా భారీ మార్కెట్ ను కూడా సంపాదించుకున్న వాడు అవుతాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
మరి ఈ సినిమా కనక తేడా కొడితే మాత్రం ఆయన కెరియర్ మరోసారి డైలమాలో పడే అవకాశాలైతే ఉన్నాయి.
కాబట్టి ఈ సినిమాని చాలా కేర్ ఫుల్ గా తీర్చిదిద్దుతున్నట్టుగా తెలుస్తోంది.ఇక బొమ్మరిల్లు భాస్కర్ కూడా చాలా సంవత్సరాల నుంచి సరైన సక్సెస్ అందుకోలేకపోతున్నాడు.
"""/" /
'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్'( Most Eligible Bachelor ) తో యావరేజ్ హిట్ సొంతం చేసుకున్న ఆయన ఈ సినిమాతో సూపర్ డూపర్ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్లుగా తెలుస్తోంది.
మరి మొత్తానికైతే ఈ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకుంటారా లేదా అనేది తెలియాల్సి ఉంది.
ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాతో భారీ విజయాన్ని సాధించి యంగ్ హీరోల్లో నెంబర్ వన్ హీరోగా మారతాడా లేదా అనేది తెలియాల్సి ఉంది.
ఈ ఇంటి చిట్కాలతో మలబద్ధకం మటాష్..!