ఏ కల వస్తే వ్యాధులు రావడానికి అవకాశం ఉంది?

అయితే మనం పడుకున్న తర్వాత చాలా కలలు వస్తుంటాయి.అందులో కొన్ని భయంకరమైనవి కాగా.

కొన్ని నవ్విస్తాయి.మరి కొన్ని బాధ పెడ్తాయి.

అయితే ఇలా దేని గురించి కల వస్తే ఏం జరుగుతుందో.అందులోనూ ముఖ్యంగా ఏ కల వస్తే వ్యాధులు వచ్చే అవకాశం ఉందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

భూత ప్రేత పిశాచులు వస్తే జ్వరం రావడానికి.ఎర్రని పూల దండలు, వస్త్రాల్లో స్త్రీ పురుషులు కనిపిస్తే రక్త సంబంధిత రోగాలు వస్తాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

అంతే కాకుండా దున్నపోతు, కుక్క, గాడిదలను ఎక్కి దక్షిణం వైపు వెళ్తున్న కలలు వస్తే.

ఊపిరి తిత్తుల సంబంధిత వ్యాధులు వస్తాయట.అలాగే రాక్షసులు, నీటితో సంబంధం ఉన్న కలలు వస్తే.

పిచ్చి నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు వస్తాయని చెబుతున్నారు.సూర్య, చంద్ర గ్రహణాలు కలలో కనిపిస్తే.

కంటి సంబంధిత వ్యాధులు వస్తాయంట.నల్ల నిది, భయంకర ముఖాలు కల్గిన వారు కలలోకి వస్తే ఎంతో జాగ్రత్త గా ఉండమని హెచ్చరిక.

అనేక వంకరలు కల్గిన వారితో నూనె తాగినట్లు కల వస్తే తీపి వ్యాధి అంటే మధుమేహం వస్తుందని సూచన.

ఈ కలల రూపానికి, వాస్తవానికీ మన జీవన ప్రవర్తనే కారణం.వచ్చే కలలన్నీ మన ఊహల్లో ఉన్నవే అని అర్థం చేసుకోవాలి.

అయితే దేవుడికి సంబంధించిన కలలు వస్తే మాత్రం చాలా మంచిదట.ఇలా మీ కలలో దేవుడు వస్తే.

భవిష్యత్తులో చేపట్టబోయే పనుల్లో కచ్చితంగా విజయం సాధిస్తారట.వంట చేస్తున్నట్లు లేదా చేసేటప్పుడు చూస్తున్నట్లు కల వస్తే ఉద్యోగం లేదా వ్యాపారంలో పురోగతి సాధించబోతున్నారని అర్థం అంట.

తన చేతివంటను రుచి చూపించిన నాగ చైతన్య.. వీడియో వైరల్