మార్నింగ్ కన్నా పాలు ఆ టైమ్ లో తాగితేనే ఎక్కువ ప్రయోజనాలు పొందుతారు.. తెలుసా?

పాలు.( Milk ) ఆరోగ్యానికి అత్యంత మేలు చేసే ఒక సూపర్ డ్రింక్.

పోషకాల పరంగా పాలకు మరొకటి సాటి లేదు.ప్రోటీన్ తో పాటు మన శరీరానికి అవసరమయ్యే ముఖ్యమైన మినరల్స్, విటమిన్స్ పాలల్లో మెండుగా ఉంటాయి.

పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ నిత్యం ఒక గ్లాసు పాలు తాగితే అనేక రోగాలకు దూరంగా ఉండవచ్చని నిపుణులు చెబుతుంటారు.

అది అక్షరాల సత్యం.అయితే పాలు తాగడానికి ఉత్తమ సమయం ఏది అంటే చాలా మంది ఉదయం ( Morning ) అని చెబుతుంటారు.

ఎక్కువ శాతం మంది ఉదయం పాలు తాగుతుంటారు.కానీ మార్నింగ్ కన్నా సాయంత్రం వేళల్లో ప్రత్యేకంగా నిద్ర పోవడానికి ముందు పాలు తాగితే ఎక్కువ ప్రయోజనాలు పొందుతారు.

ఉదయానికి బదులుగా రాత్రి నిద్రించే ముందు ఒక గ్లాసు పాలు తాగ‌డం వ‌ల్ల మంచిగా నిద్ర పడుతుంది.

పాలలో టైర్‌ఫోటోపెన్ అనే అమైనో ఆమ్లం ఉంటుంది.ఇది మెద‌డు విశ్రాంతి తీసుకోవడానికి సహాయపడుతుంది.

నిద్రలేమి సమస్యను( Insomnia ) దూరం చేస్తుంది.నిద్ర నాణ్యతను పెంచుతుంది.

హాయిగా, ప్ర‌శాంతంగా నిద్రపోతే ఉదయానికి శరీరం చురుగ్గా ఉంటుంది.ఒత్తిడి, ఆందోళన వంటి మానసిక సమస్యలు దూరం అవుతాయి.

మెదడు సక్రమంగా పనిచేస్తుంది. """/" / అలాగే పాల‌ల్లో విట‌మిన్ డి, విట‌మిన్ ఎ, జింక్‌, ప్రోటీన్ వంటి పోష‌కాలు మ‌న రోగ నిరోధక శక్తిని( Immunity Power ) పెంచ‌డానికి.

ఇన్ఫెక్ష‌న్ల‌తో పోరాడ‌టానికి తోడ్ప‌డుతాయి.కాల్షియంకు పాలు గొప్ప మూలం.

నిత్యం పాలు తాగ‌డం వ‌ల్ల శ‌రీరానికి కాల్షియం అందుతుంది.కాల్షియం ఎముకల నష్టాన్ని నివారిస్తుంది.

ఎముకలను( Bones ) బలోపేతం చేస్తుంది.బోలు ఎముకల వ్యాధి మరియు పగుళ్లను అడ్డుకుంటుంది.

"""/" / అంతేకాకుండా రోజూ నైట్ ఒక గ్లాస్ పాలు తాగ‌డం వ‌ల్ల హార్ట్ స్ట్రోక్ వ‌చ్చే ప్ర‌మాదం త‌గ్గుతుంది.

పాల‌లోని ప్రోటీన్లు జుట్టును బ‌లోపేతం చేయ‌డంలో స‌హాయం చేస్తాయి.జుట్టు రాల‌డాన్ని నివారిస్తాయి.

పైగా చ‌ర్మ ఆరోగ్యానికి కూడా పాలు ఎంతో మేలు చేస్తాయి.పాల‌లోని పోష‌కాలు చ‌ర్మం య‌వ్వ‌నంగా మ‌రియు మృదువుగా ఉండడానికి మద్దతుని ఇస్తాయి.

లవ్ యూ బేబీ అంటూ లావణ్యపై ప్రేమను చాటుకున్న వరుణ్.. ప్రేమకు ఫిదా అవ్వాల్సిందే!