ఏలేటికి తగిన సమాధానం చెప్తా.. మంత్రి ఉత్తమ్

బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి( Alleti Maheshwar Reddy ) చేసిన వ్యాఖ్యలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖండించారు.

రాష్ట్రంలో తాము యు ట్యాక్స్ వసూలు చేశామనడం పచ్చి అబద్ధం, దుర్మార్గమని పేర్కొన్నారు.

అసత్య ఆరోపణలు చేస్తూ నిత్యం వార్తల్లో ఉండాలని ఏలేటి చూస్తున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి( Uttam Kumar Reddy ) మండిపడ్డారు.

అందుకే కనీస అవగాహన లేకుండా బీజేపీ నేతలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.అస్తవ్యస్థంగా ఉన్న పాలనను గాడిలో పెట్టి నడిపిస్తున్నామని చెప్పారు.

తాను దైవ దర్శనం కోసం కుటుంబంతో వేరే రాష్ట్రానికి వెళ్లానన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రేపు సాయంత్రం హైదరాబాద్ కు వస్తున్నట్లు పేర్కొన్నారు.

ఈ క్రమంలో హైదరాబాద్ కు వచ్చిన తరువాత ఏలేటికి తగిన సమాధానం ఇస్తానని తెలిపారు.

మా అమ్మ గురించి మీకేం తెలుసు.. పవిత్ర గౌడ కూతురు ఎమోషనల్ కామెంట్స్ వైరల్!