ముంబైలో రెంట్ భరించలేక లాయర్ గగ్గోలు.. నెటిజన్ల సలహా ఏంటంటే…??

భారతదేశపు ఆర్థిక రాజధాని ముంబై( Mumbai ) ఒక ఖరీదైన నగరం.అక్కడికి పని కోసం వెళ్ళే చాలా మంది తమ జీతంలో చాలా వరకు అద్దెకే ఖర్చు చేయాల్సి వస్తుంది.

ముంబైలో ఒక 1 BHK అపార్ట్‌మెంట్ (ఒక పడకగది, ఒక హాల్, ఒక వంటగది) అద్దె నెలకు 50,000 నుంచి 70,000 రూపాయల వరకు ఉంటుందని రీసెంట్‌గా ఒక లాయర్ చెప్పారు.

ఒంటరిగా ఉండటం కంటే కుటుంబంతో కలిసి ఉండటమే మంచిదని ఆమె ఓ సోషల్ మీడియా పోస్ట్ ద్వారా సూచించారు.

"""/" / అయితే ముంబై ఖరీదైన నగరం అని, కానీ కొంచెం తెలివితేటలు, ప్లానింగ్ ఉంటే ఇక్కడ కూడా బడ్జెట్ ధరలకు జీవించవచ్చని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఈ పోస్ట్‌కు వచ్చిన కామెంట్లలో చాలా మంది తమ అనుభవాలను, చిట్కాలను పంచుకున్నారు.

బాంద్రా వంటి ఖరీదైన ప్రాంతాలకు బదులుగా అంధేరి, గోరేగావ్ ( Andheri, Goregaon )లాంటి ప్రాంతాలలో అపార్ట్‌మెంట్ అద్దెలు చాలా తక్కువ అని అన్నారు.

ఒక పెద్ద అపార్ట్‌మెంట్‌ను ఇతరులతో పంచుకోవడం ద్వారా డబ్బు ఆదా చేయవచ్చని సూచించారు.

"""/" / కొన్ని ప్రాంతాల్లో 30,000 రూపాయలకు 1 BHK అపార్ట్‌మెంట్ దొరుకుతుంది, కానీ రాత్రిపూట శబ్దాలు రావచ్చని అన్నారు.

ఢిల్లీలో రూ.9,000-10,000కు ఫర్నిష్డ్ 2 BHK అపార్ట్‌మెంట్ అద్దెకు దొరుకుతుందని, ముంబైలో రెంట్స్ అతిగా ఉంటాయని ఇంకొందరు అన్నారు.

ముంబైలో జీవన వ్యయం భారీగా పెరుగుతుండటంతో, చాలా మందికి ఇల్లు, మంచి వైద్యం, విద్య వంటి అవసరాలను తీర్చడం కష్టంగా మారింది.

జీతాలు పెరుగుతున్న వేగంతో ధరలు పెరగడం వల్ల చాలా మంది అప్పుల పాలవుతున్నారు.

లాయర్ ముంబైలో అద్దెల పెరుగుదల గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ చర్చ మొదలైంది.

ఆమె పోస్ట్‌కు 1.5 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.

ఓవ‌ర్ వెయిట్‌తో బాధ‌ప‌డేవారికి వ‌రం అవిసె గింజలు.. ఇంత‌కీ ఎలా తీసుకుంటే బ‌రువు త‌గ్గుతారు?