అసలు ‘సెంగోల్’ అంటే ఏమిటి? కొత్త పార్లమెంట్‌లో దానిని ఎందుకు ప్రతిష్టించనున్నారో తెలుసా?
TeluguStop.com
ఈ మధ్య 'సెంగోల్' ( Sengol ) అనే పదం మీడియాలో బాగా వినబడుతోంది.
దాని గురించి మీరు బహుశా చిన్నపుడు పాఠ్య పుస్తకాల్లో చదువుకొనే వుంటారు.ప్రస్తుతం అనేక హంగులతో, ఆధునిక సౌకర్యాలతో రూపుదిద్దుకున్న కొత్త పార్లమెంట్ భవనం( New Parliament ) ప్రారంభానికి సిద్ధంగా ముస్తాబైంది.
ఈ నెల 28న ప్రధాని నరేంద్ర మోడీ( PM Narendra Modi ) నూతన పార్లమెంట్ భవనాన్ని వైభవంగా ప్రారంభించనున్నారు.
ఈ కార్యక్రమానికి దేశాధినేతలు ఎంతోమంది హాజరు అవుతున్నారు.ఈ నేపథ్యంలో కొత్త పార్లమెంట్ భవనం నిర్మాణం, ప్రారంభోత్సవంలో అనేక వింతలు, విశేషాలు, చోటు చేసుకోనున్నాయి.
"""/" /
దీనిలో భాగంగానే సెంగోల్ (రాజదండం) ఇప్పుడు సెంటరాఫ్ అట్రాక్షన్‌గా మారింది.
బ్రిటీష్‌వారు భారతదేశానికి స్వాతంత్ర్యం ప్రకటించి అనంతరం అధికారాన్ని మార్పిడి చేయడానికి గుర్తుగా నాటి గవర్నర్ జనరల్ లార్డ్ మౌంట్‌బాటన్ నుంచి తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ రాజదండాన్ని స్వీకరించిన సంగతి గురించి మీరు చదివే వుంటారు.
ఈ చారిత్రక రాజదండాన్ని కొత్త పార్లమెంట్ భవనంలో ప్రతిష్టించాలని కేంద్రం తాజాగా నిర్ణయించడం ప్రత్యేకతని సంతరించుకుంది.
అవును, 5 అడుగుల పొడవు, నంది చిహ్నంతో, బంగారుపూత కలిగిన వెండిదండంతో మెరిసిపోతున్న ఈ సెంగోల్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
"""/" /
ఇక దీనిని కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం రోజున.పరిపాలన నీతి, న్యాయం, కర్తవ్యంతో సాగాలన్న సందేశాన్ని ప్రజలకు , ప్రజా ప్రతినిధులకు ఇవ్వాలన్న ఉద్దేశంతో దీనిని లోక్‌సభలో ప్రతిష్టించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అమిత్ షా తాజాగా వెల్లడించారు.
ఇకపోతే ప్రస్తుతం ఢిల్లీలోని జాతీయ మ్యూజియంలో వున్న ఈ సెంగోల్‌ను తమిళనాడులోని తిరువడుత్తురై ఆధీనం నుంచి వచ్చే వేదపండితులతో కలిసి ప్రధాని మోడీ సంప్రదాయబద్ధంగా ప్రతిష్టించనున్నారు.
సక్సెస్ కోసం ఆ విషయంలో రాజీ పడ్డాను.. నెట్టింట రష్మిక క్రేజీ కామెంట్స్ వైరల్!