రీమక్ మూవీ తర్వాతనే వీరమల్లు.. బిగ్ ట్విస్ట్ ఇవ్వబోతున్న పవన్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ హిట్ తర్వాత మరో సినిమా చేయలేదు.

ఈ సినిమా వచ్చి కూడా కొన్ని నెలలు అవుతున్న ఇప్పటికి మరో సినిమా పూర్తి చేయక పోవడంతో ఆయన ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

పవన్ చేతిలో మూడు ప్రాజెక్టులు ఉన్న కూడా ఈయన సెట్ లోకి అడుగు పెట్టలేదు.

పవన్ కళ్యాణ్ మధ్యలో కొంత కాలం నుండి సినిమాలకు బ్రేక్ ఇచ్చి రాజకీయాల కోసం సమయం కేటాయిస్తున్నాడు.

అయితే ఇటీవల మళ్ళీ సెట్స్ లో అడుగు పెట్టాలని అనుకున్నాడు అంటూ వార్తలు వచ్చాయి.

ప్రెజెంట్ పవన్ చేతిలో ఉన్న సినిమాల్లో 'హరి హర వీరమల్లు' సినిమా ఒకటి.

క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పవర్ స్టార్ కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కుతుంది.

ఇప్పటికే ఈ సినిమా 60 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది.ఇంకా 40 శాతం షూటింగ్ మిగిలి ఉండడంతో పవన్ డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారు.

ఈ మధ్యనే ఈ సినిమా మరో షెడ్యూల్ స్టార్ట్ కాబోతుంది అనే వార్తలు వచ్చాయి.

పవన్ కూడా వర్క్ షాప్ లో పాల్గొనడంతో ఈ సినిమా నిజమే అని అంతా అనుకున్నారు.

కానీ మళ్ళీ ఈయన రాజకీయాల్లో యాక్టివ్ కావడంతో అసలేం జరుగుతుందో ఎవ్వరికి అర్ధం కావడం లేదు.

ఈ క్రమంలోనే తాజాగా మరొక న్యూస్ బయటకు వచ్చింది.ఈ సినిమా కంటే ముందు మరో సినిమాలో పాల్గొనాలి అని పవన్ నిర్ణయం తీసుకుని క్రిష్ కు షాక్ ఇవ్వబోతున్నాడు అని అంటున్నారు.

పవన్ కళ్యాణ్ ఆర్డర్ లో ఒక రీమేక్ సినిమా కూడా ఉంది.తమిళంలో మంచి విజయం సాధించిన 'వినోదయ సీతమ్' అనే సినిమాను తెలుగులో పవన్ కళ్యాణ్ రీమేక్ చేయబోతున్నాడు.

"""/"/ సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది.ఇక్కడ తెలుగులో కూడా సముద్రఖని దర్శకత్వంలోనే ఈ సినిమా తెరకెక్కనుంది.

అయితే ఈ సినిమా వీరమల్లు పూర్తి అయినా తర్వాత సెట్స్ మీదకు వెళుతుంది అని అనుకున్నారు.

కానీ ఇప్పుడు మాత్రం పవన్ ముందుగా ఈ రీమేక్ సినిమాను పూర్తి చేసిన తర్వాతనే వీరమల్లు షూట్ లో పాల్గొనాలి అని నిర్ణయించు కున్నాడని టాక్ వస్తుంది.

దీంతో మరోసారి క్రిష్ కు షాక్ తప్పేలా లేదు.

ఆ విషయంలో అరవింద్ మామ చాలా బెస్ట్… రామ్ చరణ్ కామెంట్స్ వైరల్!