అరచేతిలోని రేఖల ఆధారంగా భూత, భవిష్యత్, వర్తమాన కాలాల గురించి, మనిషి తీరు గురించి తెలియజేసే శాస్త్రాన్ని హస్తసాముద్రికం-పామిస్ట్రీ అంటారు.
హస్తసాముద్రికంలో హస్తం అంటే చేయి అని అర్థం.సాముద్రికం అంటే.
దాదాపు 3వేల ఏళ్ల క్రితమే ఈ చేతి రేఖల ఆధారం సముద్రుడు అనే శాస్త్రజ్ఞుడు ఈ శాస్త్రాన్ని రచించడంతో అతని పేరు మీదుగా హస్తసాముద్రికం అనే పేరు వచ్చింది.
మొదట హస్తసాముద్రికం శాస్త్రాన్ని కనిపెట్టింది చైనీయులు.ఇప్పటికీ చైనాలోని దేవాలయాలపై అరచేతి రేఖలు, వాటి అర్థాలతో కూడిన శిల్పాలు ఉంటాయి.
అంగ సాముద్రికం, హస్తసాముద్రికం, భూసాముద్రికం అని మూడు శాస్త్రాలున్నాయి.పుట్టిన తేదీ తెలియకపోయినా, ఏదైనా వ్యాపారం ప్రారంభించాలనుకున్నా, కెరీర్‌లో ఏదైనా కీలక నిర్ణయం తీసుకోవాలని అనుకున్నా హస్తసాముద్రికంతో నిర్ణయించుకోవచ్చని హస్తసాముద్రికం-పామిస్ట్రీ పండితులు చెబుతున్నారు.
అరచేతిలో రేఖలను చూసి వ్యక్తుల తీరునూ అంచనా వేయవచ్చు.కీరోనమీ, కీరోమాన్సీ లాంటి శాస్త్రాలు హస్తసాముద్రికంతో ముడిపడినవే.
అరచేతులు పొడుగ్గా ఉన్నా, పొట్టిగా ఉన్న వ్యక్తులు ఒక్కో రకంగా ప్రవర్తిస్తుంటారు.కొందరి అరచేతులు లేత గులాబీ రంగులో ఉంటాయి.
మరికొందరిని లేత పసుపు వర్ణంలో ఉంటాయి.ఇలా నల్ల, ఎర్రగా కూడా అరచేతులు ఉంటాయి.
వీటి ఆధారంగా వారు తమ జీవితంలో ఎలాంటి అడ్డంకులు ఎదుర్కొంటారు, ఎలాంటి ఉన్నతి సాధిస్తారనేది చెప్పవచ్చని హస్తసాముద్రికం పండితులు చెబుతున్నారు.
సుదీక్ష కోణంకి అదృశ్యం కేసులో పురోగతి.. బీచ్ వద్ద కనిపించిన దుస్తులు