తెలుగు రాష్ట్రాలపై మోడి వ్యూహం ఏంటో ?

తెలుగు రాష్ట్రాలపై పట్టు కోసం బీజేపీ( BJP ) ఎప్పటి నుంచో ప్రయత్నిస్తోంది.

కానీ ఆశించిన స్థాయిలో ఫలితాలు మాత్రం సాధించడం లేదు.తెలంగాణలో పార్టీ కొంత మెరుగ్గానే కనిపిస్తున్నప్పటికి అధికారం సాధించేంతా బలంగా ఉందా అంటే ఆ పార్టీ నేతలే సమాధానం చెప్పలేని పరిస్థితి.

ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే అసలు ఏపీలో బీజేపీ ఉన్న లేనట్లుగానే ఉంది ఇక్కడి పరిస్థితి.

మరోవైపు రెండు రాష్ట్రాల్లోనూ ఎన్నికలు ముంచుకొస్తున్నాయి.ఈ నేపథ్యంలో అందరి దృష్టి పార్టీపై పడేందుకు బీజేపీ కొత్త ఎత్తుగడలకు సిద్దమౌతున్నట్లు తెలుస్తోంది.

ఆంద్రప్రదేశ్ విభజన విషయంలో ప్రతిసారి ఆచితూచి స్పందించే కాషాయ పెద్దలు.ఇప్పుడు మాత్రం విభజన అంశాన్నే తెరపైకి తెచ్చి కొత్త చర్చలకు నాంది పలుకుతున్నారు.

"""/" / తాజాగా జరుగుతున్నా ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా మోడి తెలుగు రాష్ట్రాలపై చేసిన వ్యాఖ్యలు కొంత చర్చనీయాంశం అవుతున్నాయి.

ఏపీ తెలంగాణను విభజించినప్పుడు ఎన్నో ఘర్షణలు జరిగాయని విభజన ఆమోద యోగ్యంగా జరగలేదని మోడి( Narendra Modi ) చెప్పుకొచ్చారు.

అటు కొత్త రాష్ట్రం వచ్చిన తెలంగాణలోనూ సంబరాలు జరగలేదని అన్నారు.వాజ్ పెయ్ హయంలో మూడు రాష్ట్రాలను విజయవంతంగా విభజించిన ఘనత బీజేపీకి ఉందని అప్పుడు ఎలాంటి గొడవలు జరగలేదని ప్రజలు సంతోషంతో విభజనను సంబరాలు చేసుకున్నారని చెప్పిన మోడి.

ఏపీ తెలంగాణ విభజన మాత్రం ప్రజలకు అయిష్టంగా జరిగిందని ప్రధాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఆయన చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ బి‌ఆర్‌ఎస్‌ నేతలు( Brs Party ) తీవ్ర స్థాయిలో మండి పడుతున్నారు.

"""/" / రెండు రాష్ట్రాల మద్య మళ్ళీ చిచ్చు పెట్టేందుకే మోడి( Narendra Modi ) ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మండి పడుతున్నారు.

అయితే మోడీ ఈ రకమైన వ్యాఖ్యలు చేయడానికి కారణం ఏంటి అనే దానిపై విశ్లేషకులు చెబుతున్నా దాని ప్రకారం.

ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంపై అటు తెలంగాణలోనూ, ఇటు ఏపీలోనూ ప్రజల్లో కొంత వ్యతిరేకత ఉంది.

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేదని, విభజన హామీలు నెరవేర్చలేదని ప్రజలు గుర్రుగా ఉన్నారు.

అలాగే తెలంగాణకు నిధులు సమకూర్చడం లేదని, రాష్ట్రంపై కేంద్రం పక్షపాతం చూపిస్తోందని ఇక్కడి ప్రజల్లో కొంత అసంతృప్తి ఉంది.

ఈ నేపథ్యంలో విభజన టైమ్ లో చోటు చేసుకున్నా అంశాలను తెరపైకి తెస్తే ప్రజల దృష్టిని మళ్లించవచ్చని, ఆ తరువాత తప్పంతా కాంగ్రెస్ పైకి తోయోచ్చనే ప్లాన్ తోనే మోడీ వ్యూహాత్మకంగా విభజన ప్రస్తావన తెరపైకి తెచ్చారని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు.

మొత్తానికి మోడీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి.

పోసానిని క్షమించినా తప్పే.. వైరల్ అవుతున్న యంగ్ ప్రొడ్యూసర్ షాకింగ్ కామెంట్స్!