మంచు విష్ణు కన్నప్ప సినిమా టీజర్ అలా ఉందేంటి..? వర్కౌట్ అవుతుందా..?

సినిమా ఇండస్ట్రీలో మోహన్ బాబు( Mohan Babu ) కొడుకుగా తనకంటూ మంచి ఇమేజ్ ను ఏర్పాటు చేసుకున్న నటుడు మంచు విష్ణు.

అయితే ఈయన ఇండస్ట్రీకి వచ్చి 20 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఆయనకు సరైన సక్సెస్ అయితే లేదు.

ఇక ఇప్పుడు కన్నప్ప సినిమాతో ఒక భారీ సక్సెస్ ని అందుకోవాలని చూస్తున్నాడు.

"""/" / ఇక అందులో భాగంగానే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ని ఈ రోజు రిలీజ్ చేశారు.

ఇక ఈ టీజర్ టెక్నికల్ గా బాగానే ఉన్నప్పటికీ ఎక్కడో కొంచెం తేడా కొట్టినట్టుగా కనిపిస్తుంది.

మరి ఈ సినిమాని అనుకున్నది అనుకున్నట్టుగా తెరకెక్కిస్తున్నారా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి.

ఇక ఈ సినిమాలో ప్రభాస్ కూడా ఒక కీలకపాత్రలో నటిస్తున్నాడు అనే విషయం మనందరికీ తెలిసిందే.

మరి ఆ పాత్ర సినిమాకి ఎంతవరకు ప్లస్ అవుతుంది అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

ఇక మొత్తానికైతే ఈ సినిమా సక్సెస్ అయితే విష్ణు ఇండస్ట్రీలో ఉంటాడు లేకపోతే మాత్రం ఆయన ఇండస్ట్రీ నుంచి ఫేడ్ అవుట్ అయిపోవడం పక్క అంటూ చాలామంది సినీ మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను అయితే తెలియజేస్తున్నారు.

"""/" / ఇక ఈ సినిమా ద్వారా మంచు విష్ణు( Manchu Vishnu ) ప్రభాస్ కి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ కూడా అందరికీ అర్థమవుతుంది.

ఇక ఇందులో ప్రభాస్ కూడా ఒక కీలక పాత్రలో నటించడం అనేది నిజంగా గొప్ప విషయం అనే చెప్పాలి.

ఇక ఈ సినిమాను కృష్ణంరాజు మొదట ప్రభాస్ తో చేయాలనుకున్నాడు.కానీ అది వర్క్ అవుట్ అవ్వలేదు.

ఇక దాంతో మంచు విష్ణు ఈ సినిమాని చేస్తూ ప్రభాస్ ను ఇన్వాల్వ్ చేయడం అనేది నిజంగా గొప్ప విషయం అనే చెప్పాలి.

చూడాలి మరి ఈ సినిమా ఎంత పెద్ద విజయాన్ని సాధిస్తుంది అనేది.

అల్లు అర్జున్ కి ఒక రూల్..వారికి ఒక రూలా… బన్నీ అరెస్టుపై సుమన్ షాకింగ్ కామెంట్స్!