ఎన్టీఆర్‌ : బాలయ్యకు లక్ష్మీ పార్వతితో పెద్ద తలనొప్పి

తెలుగు వారి ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా క్రిష్‌ దర్శకత్వంలో ‘ఎన్టీఆర్‌’ చిత్రం తెరకెక్కుతుంది.

భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం అయ్యింది.

బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు.ఇక విద్యాబాలన్‌ ఈ చిత్రంలో బసవతారకం పాత్రలో కనిపించబోతున్నారు.

ఎన్టీఆర్‌ సినిమాల్లోకి ఎలా వచ్చాడు, ఆ తర్వాత రాజకీయాల్లో ఎలా రాణించాడు అనే విషయాను ఈ చిత్రంలో చూపించేందుకు దర్శకుడు సిద్దం అవుతున్నాడు.

ఇక రాజకీయాల్లో ఎన్టీఆర్‌ చక్రం తిప్పిన సమయంలో ఆయన పక్కన లక్ష్మీ పార్వతి ఉన్న విషయం తెల్సిందే.

నందమూరి ఫ్యామిలీ మొత్తం బద్ద శత్రువుగా భావించే లక్ష్మీ పార్వతి పాత్రను ‘ఎన్టీఆర్‌’ చిత్రంలో చూపిస్తారా లేదా అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా ఉంది.

ఎన్టీఆర్‌ను రెండవ పెళ్లి చేసుకున్న లక్ష్మీ పార్వతి మొత్తం అధికారాన్ని తనవైపుకు తిప్పుకుని, ఎన్టీఆర్‌ను కొడుకులకు మరియు కూతుర్లకు దూరంగా ఉండేలా చేసిందనే విమర్శలు ఉన్నాయి.

ఎన్టీఆర్‌ చిత్రంలో లక్ష్మీ పార్వతి గురించి చూపించాలంటే బాలకృష్ణ ఖచ్చితంగా నెగటివ్‌గానే చూపిస్తాడు.

లక్ష్మీ పార్వతిపై తనకు ఉన్న కోపంను ఎన్టీఆర్‌ చిత్రం ద్వారా బాలకృష్ణ బయట పెడతాడేమో.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ ఒకవేళ ఎన్టీఆర్‌ చిత్రంలో తనగురించి తప్పుగా చూపిస్తే లక్ష్మీ పార్వతి ఖచ్చితంగా చూస్తూ ఊరుకోదు.

గతంలోనే ఎన్టీఆర్‌ జీవితంలో విలన్‌ అంటే అది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు అని, తనను ఆయన జీవితంలో ఎంతగానో ప్రేమించాడు.

బాలయ్య బాబు తనను సినిమాలో విలన్‌గా చూపిస్తే మాత్రం తాను కోర్టును ఆశ్రయిస్తాను అంటూ హెచ్చరించింది.

ముందే లక్ష్మీ పార్వతి హెచ్చరించిన నేపథ్యంలో బాలకృష్ణ మరియు క్రిష్‌లు ఆమె పాత్రను ఎలా డిజైన్‌ చేస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.

ఇక లక్ష్మీ పార్వతి పాత్రను ఎవరు చేస్తారు అనేది కూడా ఆసక్తికరంగా ఉంది.

లక్ష్మీ పార్వతి పాత్రను ఒకవేళ చూపించిన లైట్‌గా, పాజిటివ్‌గా చూపిస్తే తప్ప సినిమా విడుదలకు అడ్డంకులు ఉండవు.

ఒకవేళ లక్ష్మీ పార్వతి గురించి ఎక్కువ, అది కూడా నెగటివ్‌గా చూపిస్తే సినిమాకు మొదటికే మోసం వస్తుంది.

ఎన్టీఆర్‌ అధికారిక రెండవ భార్య లక్ష్మీ పార్వతి కనుక కోర్టు కూడా ఆమెకు మద్దతుగా నిలిచే అవకాశం ఉందని సినీ వర్గాల వారు అంటున్నారు.

ఈ సమయంలో క్రిష్‌ మరియు బాలకృష్ణు ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటారు అనేది చూడాలి.

లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్‌లో నటించిన యంగ్ సెలబ్రిటీలందరూ సక్సెస్.. ఆ ఒక్కరు తప్ప..??