కాలసర్ప దోషం అంటే ఏమిటి? జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇలా పరిష్కరిస్తే మంచిది..!
TeluguStop.com
జ్యోతిష్య శాస్త్రం( Jyotishya Sastram ) ప్రకారం ఒక వ్యక్తి జాతక ప్రభావం పాప పుణ్యాలు, కర్మ ఫలితాలను బట్టి జీవితంలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది.
అందులో అతి ప్రధానమైన సమస్య కాలసర్ప దోషం.( Kalasarpa Dosham ) దీని వల్ల పూర్వజన్మ కర్మ ఫలితాలని ఈ జన్మలో అనుభవించాల్సి వస్తుంది.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారము మానవుని జాతక చక్రంలో రాహువు, కేతు( Rahu Ketu ) గ్రహాల మధ్య ఎలాంటి గ్రహాలు లేకపోతే దానిని కాలసర్ప దోషము అని అంటారు.
దీని వల్ల జీవితంలో ఒక్క పనిలో కూడా విజయం సాధించలేరు.ఈ దోషాన్ని ఎలా పరిష్కరించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
"""/" /
కాల సర్ప దోష ప్రభావం వల్ల ఆ వ్యక్తులకి జీవితంలో ప్రతి పనిలో అటంకాలు ఎదురవుతూ ఉంటాయి.
వివాహము( Marriage ) ఆలస్యమవుతుంది.ఒక వేళ వివాహమైన వైవాహిక జీవితంలో సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి.
ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోవడం, కొన్ని సందర్భాలలో మూర్ఖంగా వ్యవహరించడము జరుగుతుంది.దీని వల్ల అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
కాల సర్ప దోషము వారి జాతకంలో ఉన్న స్థానాన్ని బట్టి శరీరక సమస్యలు, మానసిక ఇబ్బందులు ఏర్పడతాయి.
కాలసర్ప దోషమున్న జాతక వ్యక్తులు ప్రతి రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని( Subhramanyeswara Swamy ) ఆరాధించాలి.
"""/" /
ముఖ్యంగా చెప్పాలంటే వారి పేరులో నాగ లేదా సుబ్రహ్మణ్య ఉండేటట్లుగా చూసుకోవడం మంచిది.
ప్రసిద్ధ సుబ్రహ్మణ్య క్షేత్రాలలో అభిషేకాలు, హోమాలు చేయాలి.జాతకంలో తీవ్రమైన కాల సర్ప దోషాలు ఉన్నవారు నాగ ప్రతిష్ట చేయడం వల్ల శుభ ఫలితాలను పొందుతారు.
అంతే కాకుండా కాల సర్ప దోషము వల్ల వైవాహిక జీవితంలో సమస్యలు ఉన్నవారు రాహు కేతువులకు శాంతి హోమాలు చేయాలి.
అలాగే మంగళవారం కుజ గ్రహాన్ని పూజించాలి.శనివారం రాహు కేతువులను పూజించాలి.
దుర్గాదేవిని( Durga Devi ) ఆరాధించడం వల్ల ఈ దోష పరిహారం జరుగుతుందని పండితులు చెబుతున్నారు.
యూపీ అబ్బాయి కోసం చైనా నుంచి వచ్చి.. లెహంగాలో అదరగొట్టిన పెళ్లికూతురు.. వీడియో వైరల్..