జ్వాలాతోరణం ఎలా నిర్వహిస్తారు.. దాని ప్రాముఖ్యత ఏమిటంటే..?
TeluguStop.com
కార్తీక పౌర్ణమి( Karthika Pournami ) రోజు సాయంత్రం సమయంలో శైవ దేవాలయాలలో జ్వాల తోరణం( Jwala Thoranam ) అనే ప్రత్యేక ఉత్సవాన్ని నిర్వహిస్తారు.
శివాలయం ఎదుట రెండు కర్రలు నిలుపుగా పాతి ఒక కర్రను వాటికి అడ్డంగా పెడతారు.
అడ్డంగా పెట్టిన కర్రకు కొత్త గడ్డీని చుడతారు.దీన్ని యమధర్మ దూరం అని అంటారు దీనినే యమద్వారం అని అంటారు.
ఈ నిర్మాణం పై నెయ్యి పోసి మంట పెడుతారు.ఆ మంట కింద నుంచి ఈ పరమేశ్వరుడిని పల్లకిలో అటు ఇటు మూడు సార్లు ఊరేగిస్తారు.
జ్వాలా తోరణం కింద ఈశ్వరుడి పల్లకి పక్కనే నడుస్తూ మహాశివ నేను ఇప్పటిదాకా చేసిన పాపాలన్నీ ఈ మంటల్లో కాలిపోవాలి వచ్చే సంవత్సరం వరకు ఎలాంటి తప్పు చేయకుండా సన్మార్గంలో నీ బాటలోనే నడుస్తాను అని ప్రతిజ్ఞ చేయాలని పండితులు చెబుతున్నారు.
"""/" /
అలాగే కాలిపోగా మిగిలిన గడ్డిని తీసుకువచ్చి ఇంటి గడ్డివాములోను ధాన్య గరాలలోను పెట్టడం శునప్రధమని పండితులు చెబుతున్నారు.
జ్వాలా తోరణం భష్పం ధరిస్తే భూత, ప్రేత, పిశాచ బాధలన్నీ తొలగిపోతాయని చాలా మంది ప్రజలు నమ్ముతారు.
అలాగే ఈ రోజు శివుడి దేవాలయాల్లో( Shivalayam ) స్తంభాలకు గడ్డితో తోరణాలు ఏర్పాటు చేస్తారు.
వాటికి నూనెలో ముంచిన వస్త్రాలను తగిలించి వెలిగిస్తారు.ఆ జ్వాలాతోరణాల చుట్టూ ఉత్సవ విగ్రహాలని మూడుసార్లు తిప్పుతారు.
"""/" /
ఇంకా చెప్పాలంటే జ్వాలాతోరణం ఉత్సవాన్ని ప్రవేశపెట్టడం వెనుక ఒక బలమైన కారణం ఉందని నిపుణులు చెబుతున్నారు.
యమలోకంలోకి వెళ్లిన వారికి మొదట దర్శనమిచ్చేది జ్వాలాతోరణం.యమ లోకానికి( Yamalokam ) వెళ్లిన ప్రతి వ్యక్తి ఈ తోరణం మిదుగా లోపలికి వెళ్లాల్సి ఉంటుంది.
వాస్తవానికి ఇది పాపులకు వేసే ప్రధమ శిక్ష.ఈ శిక్షను తప్పించుకోవాలంటే ఈశ్వరున్ని ప్రార్థించాలని పండితులు చెబుతున్నారు.
అందుకే కార్తీక పౌర్ణమి రోజున ఎవరైతే జ్వాలాతోరణం నుంచి మూడుసార్లు అటూ ఇటూ వెళ్లి వస్తారో వారికి ఈశ్వరుడి అనుగ్రహం లభిస్తుందని చెబుతున్నారు.
అతనికి ఇక యమ ద్వారం చూడాల్సిన అవసరం రాదని కూడా చెబుతున్నారు.అందుకే ఈ జ్వాలా తోరణం తోరణం మహోత్సవంలో పాల్గొనాలని పెద్దవారు చెబుతూ ఉంటారు.
సందీప్ కిషన్ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్న నాగార్జున హీరోయిన్…