క్షిపణి నిరోధక వ్యవస్థ అంటే ఏమిటి? అది ఎలా పని చేస్తోందో తెలిస్తే..

ప్రపంచంలోనే అత్యుత్తమ క్షిపణి నిరోధక వ్యవస్థను ఇజ్రాయెల్ కలిగి ఉంది.ఇజ్రాయెల్‌కు చెందిన ఐరన్ డోమ్ క్షిపణి రక్షణ వ్యవస్థ మోర్టార్ల నుండి వారిని రక్షించే విధంగా రూపొందించబడింది.

దీని అంతరాయ రేటు 90% వరకు ఉంటుంది.ఇజ్రాయెల్ ఇప్పుడు అనేక యాంటీ బాలిస్టిక్ క్షిపణి రక్షణ వ్యవస్థలపై పని చేస్తోంది.

అలాగే, ఇజ్రాయెల్ ఒక నూతన వ్యవస్థను రూపొందిస్తోంది.ఇది ట్యాంకులు మరియు నౌకలను కూడా రక్షించగలదు.

దీనిని ఇజ్రాయెల్ ప్రభుత్వ రక్షణ సంస్థ రాఫెల్ అడ్వాన్స్‌డ్ డిఫెన్స్ సిస్టమ్స్ అభివృద్ధి చేసింది.

దీనిని డిఫెన్స్ మిసైల్ బ్యాటరీ అని కూడా అంటారు.ఇజ్రాయెల్ అంతటా ఇటువంటి ఏడు రక్షణ క్షిపణి బ్యాటరీలు ఏర్పాటు చేశారు.

ప్రతి బ్యాటరీకి ఇంటర్‌సెప్ట్ మిస్సైల్ సామర్థ్యం ఉంటుంది.ఇది సురక్షితమైన వైర్‌లెస్ కనెక్షన్ ద్వారా నిర్వహించబడుతుంది.

ఐరన్ డోమ్‌లో రాడార్ యూనిట్, క్షిపణి నియంత్రణ యూనిట్ మరియు అనేక లాంచర్‌లు ఉంటాయి.

ఈ రక్షణ వ్యవస్థ అన్ని వాతావరణంలోనూ పని చేయగలదు.దీని డిటెక్షన్-ట్రాకింగ్ రాడార్, వెపన్ కంట్రోల్ సిస్టమ్ మరియు మిస్సైల్ ఫైరింగ్ యూనిట్ తుప్పుపట్టనివిగా తీర్చిదిద్దారు.

రాడార్ 4 నుండి 70 కి.మీ దూరం నుండి లక్ష్యాన్ని గుర్తించి.

నిఘా సారిస్తుంది.నాలుగు నుండి ఐదు లాంచర్‌లు ఒకేసారి 20 క్షిపణులను మోసుకెళ్తాయి.

ఈ క్షిపణులు హీట్ మరియు ఎలక్ట్రిక్ సెన్సార్‌లతో ఉంటాయి.ఇతర క్షిపణులను ఢీకొని వాటిని నాశనం చేస్తాయి.

ఐరన్ డోమ్ సిస్టమ్ మొదట రాకెట్‌ను గుర్తిస్తుందని, ఆపై లక్ష్య ప్రాంతం యొక్క పరిధి, దిశను తనిఖీ చేస్తుందని మీడియా నివేదికలో తెలియజేశారు.

అనంతరం వార్నింగ్ ఇచ్చి సైరన్ మోగిస్తారు.అనంతరం స్థానికులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లడానికి కాస్త సమయం ఇస్తారు దీని తరువాత, నష్టాన్ని ఊహించి, ఐరన్ డోమ్ ఆపరేటర్లు కౌంటర్ క్షిపణులను ప్రయోగించి, రాకెట్‌ను గాలిలో నాశనం చేస్తారు.

ఐరన్ డోమ్ మొబైల్ లాంచర్‌ను ట్రక్కు సహాయంతో ఎక్కడికైనా రవాణా చేయవచ్చు.రథాన్ అనేది రక్షణ రంగానికి సంబంధించిన సంస్థ.

ఈ యూనిట్‌ దాదాపు 155 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని రక్షించగల సామర్థ్యాన్ని కలిగి ఉంది.

రామ్ చరణ్ పెద్ది టీజర్ లో చూపించేది ఇదేనా..?