అనుష్క మరింత స్లిమ్ గా మారుతోందా? అందుకే సినిమాలకు దూరంగా ఉందా?
TeluguStop.com
సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్ అనుష్క.చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటుంది.
బాహుబలితో కనీవినీ ఎరుగని విజయాన్ని ఖాతాలో వేసుకున్న ఈ బొద్దుగుమ్మ.ఆ తర్వాత నిశ్శబ్దం అనే సినిమాలో నటించింది.
ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో విజయం సాధించలేదు.ఆ తర్వాత వేరే సినిమాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.
తాజాగా ఆమె సినిమాలకు ఎందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు? అనే చర్చ జరుగుతోంది.
అయితే ఆమె సినిమాల్లో నటించకపోవడానికి చాలా కారణాలు చెప్తున్నారు సినీ జనాలు.సైజ్ జీరో సినిమా కోసం ఈ అమ్మడు ఓ రేంజిలో బరువు పెరిగింది.
ఆ తర్వాత కొంత మేర తగ్గింది.కానీ.
అనుకున్నంత స్థాయిలో తగ్గలేదు.ఇప్పటికీ ఈమెను అధిక బరువు సమస్య వేధిస్తుందట.
దీంతో పాటు ఆమె వయసు కూడా 35 దాటిపోయింది.దీంతో ఆమెకు పెళ్లి చేయాలనుకుంటున్నారట కుటుంబ సభ్యులు.
కారణాలు పక్కాగా తెలియక పోయినా.అనుష్క మాత్రం సినిమాలకు దూరంగా ఉంటూ వస్తుంది.
బాహుబలి సినిమా తర్వాత అనుష్క ఓ రేంజిలో బిజీ అవుతుందని అందరూ అనుకున్నారు.
పాన్ ఇండియన్ హీరోయిన్ గా బాలీవుడ్ ను దున్నేసే అవకాశం ఉందని అందరూ అనుకున్నారు.
కానీ ఈ అంచనాలు అన్నీ తలకిందులు అయ్యాయి.ఉన్న ప్రాజెక్టుల ముచ్చట అటుంచితే.
అసలు సినిమాలకే దూరంగా ఉంటుంది.సైజ్ జీరో సినిమా అంటూ ఈ అమ్మడు అబ్ నార్మల్ గా బరువు పెరిగింది.
కానీ తగ్గలేకపోతుంది.ఎలాగైనా బరువు తగ్గాలనే ఆలోచనతో రకరకాల ప్రయత్నాలు చేస్తుంది.
ప్రక్రుతి వైద్యం కూడా చేయించుకుంటుందట.పూర్తిగా బరువు తగ్గే వరకు సినిమాలకు ఓకే చెప్పకూడదు అనుకుంటుందట ఈ ముద్దుగుమ్మ.
"""/"/
ఈ మధ్యే అనుష్కకు సంబంధించిన పలు ఫోటోలు విడుదల అయ్యాయి.న్యూ లుక్ లో అందరినీ ఆకట్టుకుంది.
కానీ అనుకున్నంత స్థాయిలో బరువు మాత్రం తగ్గినట్లు కనిపించడం లేదు.కాస్త సన్నగా తయారైనా.
గతంలో మాదిరిగా స్లిమ్ గా మారలేదు.మరికొద్ది రోజుల్లోనే గతంలో కంటే మరింత స్లిమ్ గా తయారవడం ఖాయం అంటున్నారు సినీ జనాలు.
త్వరలోనే అనుష్క నుంచి గుడ్ న్యూస్ వినే అవకాశం ఉంది.గతంలో ఉన్న కొన్ని అగ్రిమెంట్లను కూడా పూర్తి చేసుకునే అవకాశం ఉంది.
వారం రోజుల్లో 2 డబుల్ సెంచరీలు.. టీమిండియా సెలక్షన్ కమిటీకి సంకేతాలు ఇస్తున్నాడుగా?